ఈ మధ్య తెలుగుదేశం సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డిలో కాస్త స్థిమితం తగ్గినట్టుంది. తరచుగా తన రాజకీయ పాత మిత్రులను కలవడం ఆయనకు అలవాటు. అదే క్రమంలో ఈరోజు తెలంగాణ శాసన సభ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన అసెంబ్లీకి వెళ్లారు. అక్కడ తన పాత మిత్రులను కలుసుకుని ముచ్చటించారు.
అనంతరం కాసేపు మీడియాతో కూడా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన విచిత్రమైన వ్యాఖ్యలు చేశారు. సీఎల్పీలో ఫ్రెండ్స్ ను కలిశాను. ఏపీ వదిలేసి తెలంగాణలో వచ్చేస్తాను. నాకు ఏపీ రాజకీయాలేం నచ్చడం లేదు. తెలంగాణ రాజకీయాలే బాగున్నాయి ఏపీ మీద అన్నారు.
నిజానికి రాజకీయాలను మాత్రమే కాదు, సమాజాన్ని నిందించాలి. ఎందుకంటే సమాజం బాగుంటే రాజకీయాలు కూడా బాగుండేవి అన్నారు. తెలంగాణ వదిలేశాక తాను చాలా నష్టపోయినట్లు చెప్పారు. అయితే తెలంగాణకు రావడం అంటే ఎవరైనా రావచ్చు. ఎక్కడైనా పోటీ చేసే అవకాశం కూడా రాజ్యాంగం ఇచ్చింది. ఇక ఆయన తన సొంతూరిని వదిలేయడం ఏంటన్నదే అర్థం కావడం లేదు. కొడుకు, తమ్ముడు తాడిపత్రిలో చక్రం తిప్పుతున్నారు. రేపు రేపు వారికి అక్కడ మంచి భవిష్యత్తు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో జేసీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటో మరి. ఆయనకే తెలియాలి.