నరసాపురం ఎంపీ రఘురామరాజు జగన్ పరువు తీసిపడేశాడు. బస్సులు లేక ప్రజలు ఇబ్బంది పడుతుంటే… తన స్నేహితుడు అయిన కెసిఆర్ ని ఒప్పించి బస్సులు నడపలేకపోవడం ఏంటి అని ప్రశ్నించారు.
151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు ఉంటే న్యాయవ్యవస్థనే పక్కనపెట్టేయొచ్చు అన్న ఆలోచన వచ్చిన మీకు… కేసీఆర్ తో బస్సులు నడిపించడానికి ఆ బలం సరిపోతుంది అనే విషయం ఎందుకు అర్థం కావడం లేదు.
మీరు వెంటనే కేసీఆర్ తో మాట్లాడి బస్సులు నడిపించండి. మీకు చేతకాకపోతే మీకు నేను నచ్చకపోయినా నాకు చెప్పండి. ప్రజల కోసం కాబట్టి నేను ముందుకు వచ్చి మాట్లాడతాను. ఆ సమస్య పరిష్కరించుకుని వస్తాను అన్నారు.
మొత్తానికి రఘురామరాజు వ్యాఖ్యతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కి తల తీసేసినట్టయ్యింది. మరి ఏం చేస్తారో చూడాలి. రఘురామరాజు ఎంచుకునే సమస్యలు కూడా సరిగ్గా ప్రజలకు కనెక్ట్ అయ్యుండేవే కావడంతో ప్రజల మద్దతు రఘురామరాజుకు గట్టిగా ఉంది.