రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న నగరాల్లో విజయవాడ ఒకటి. గత ఎన్నికల్లో.. టీడీపీ సాధించిన ఎంపీ స్థానాల్లో విజయవాడ పార్లమెంటు స్థానం కూడా ఉంది. అంతేకాదు.. ఇక్కడ వైసీపీ సునామీలోనూ ఒక అసెంబ్లీ స్థానం కూడా టీడీపీకి దక్కింది.
గద్దె రామ్మోహన్ తూర్పు నియోజకవర్గం నుంచి వరుస విజయాలు సాధించారు. ఇక, సెంట్రల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బొండా ఉమా మహేశ్వరరావు.. కేవలం 25 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే.. పార్టీకి కంచుకోట వంటి విజయవాడలో గడిచిన రెండేళ్లలో నాయకుల మధ్య సఖ్యత కనిపించలేదనే వాదన బలంగా వినిపించింది.
మరీ ముఖ్యంగా ఈ ఏడాది మార్చిలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల సమయంలో ఎంపీ కేశినేని నాని కేంద్రంగా.. టీడీపీ స్థానిక నేతలు.. తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో నేతల మధ్య సఖ్యత లోపించి.. వస్తుందని అనుకున్న విజయవాడ కార్పొరేషన్ కూడా టీడీపీకి దక్కకుండా పోయింది.
ఇక, ఆ తర్వాత. కూడా నేతలు కలిసిమెలిసి పనిచేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎవరికివారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరించారు. ఆయా విషయాలను పరిగణనలోకి తీసుకున్న చంద్రబాబు..ఇ టీవల.. నేతలకు గట్టిగానే క్లాస్ ఇచ్చారు. పార్టీలో ఉంటే అందరూ కలిసి మెలిసి పనిచేయాలని లేకపోతే.. వెళ్లిపోవాలని.. ఆయన గట్టిగానే గదమాయించారు.
దీంతో ఇప్పుడు విజయవాడ టీడీపీలో భారీ మార్పులు కనిపిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు ఎవరికివారుగా ఉన్న విజయవాడ టీడీపీ నేతలను.. తాజాగా జరిగిన పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసన కార్యక్రమం ఒక్కటి చేసింది.
నిజానికి స్థానిక ఎన్నికల నాటి నుంచి నిన్న మొన్నటి వరకు కూడా మేయర్ పీఠంపై జరిగిన వివాదంతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సహా సెంట్ర ల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు ఇతర నేతలు.. ఒకరిపై ఒకరు పరోక్షంగా విమర్శలు చేసుకు న్నారు. దీంతో చాలా రోజులు.. నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. ఎవరికివారుగానే కార్యక్ర మాలు నిర్వహించారు.
కానీ, తాజాగా జరిగిన రాష్ట్ర వ్యాప్త నిరసనలో నాయకులు అందరూ ఒక్కటయ్యారు. ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. ఈ పరిణామం నిజంగానే ఆహ్వానిందగిన పరిణామంగా ప రిశీలకులు చెబుతున్నారు. అయి తే.. ఇది మున్ముందుకూడా కొనసాగుతుందా? అనేది చూడాలి. అదేసమయంలో మిగిలిన నేతలను గమనిస్తే.. పశ్చి మ నియోజకవర్గంలో వివాదాలు అలానే కొనసాగుతున్నాయి.
తాజాగా జరిగిన నిరసనలో పశ్చిమ నియోజక వర్గానికి చెందిన నాయకులు ఒక్కరూ కూడా పాల్గొనలేదు. చంద్రబాబు పదేపదే చెప్పిన దరిమిలా.. కొందరు నేతలు మారినా.. ఇంకొందరు ఇంకా అలకపాన్పులు వీడక పోవడం గమనార్హం. మరి వీరు ఎప్పటికి లైన్లోకి వస్తారో చూడాలి. ఏదేమైనా చంద్రబాబు వ్యూహం ఫలించిందని అంటున్నారు పరిశీలకులు.