ఏపీ అధికార పార్టీ వైసీపీలో రాజ్యాంగంపై సంపూర్ణంగా అవగాహన ఉన్న ఏకైక వ్యక్తి నరసాపురం ఎంపీ రఘురామరాజు. ఆ ఒక్కడిని కూడా వైసీపీ అధినేత తన చేష్టలతో దూరం చేసుకున్నారు. ఒకప్పుడు వైఎస్ చేత సీబీఐ నుంచి కాపాడబడిన వ్యక్తి బొత్స. ఆ తర్వాత వైఎస్ ను తాగుబోతు అని తిట్టిన వ్యక్తి కూడా బొత్సయే.
అనంతరం అనుకోకుండా వైసీపీ బలపడటంతో దిక్కులేక జగన్ ని బతిమాలి ఆ పార్టీలో చేరిపోయారు.
అయితే, బొత్స సత్యనారాయణ ఏ దారీ లేక వైసీపీ లో ఉన్నారు కానీ ముఖ్యమంత్రి కావాలి అనుకుంటున్న వ్యక్తి. ఒక చిన్న జిల్లాలో హవా ఉన్నంత మాత్రాన ముఖ్యమంత్రి అయిపోతే జేసీ వంటి వారు ఎపుడో సీఎం కావల్సింది. ఈ కథంతా పక్కన పెడితే తాను సీఎం అవ్వాలని దానికి అవకాశం వచ్చినపుడు వాడుకోవాలని బొత్స ఎదురుచూస్తున్నారు.
ఈ విషయాన్ని తాజాగా రఘురామరాజు చేసిన వ్యాఖ్యల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి జగన్ విదేశీ, ఇతర పర్యటనలకు వెళ్లినప్పుడే ఏపీలో వాతావరణాన్ని వేడెక్కించేందుకు మంత్రి బొత్స సత్యనారాయణ రాజకీయ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తారని, పరిస్థితులు ఎలా ఉన్నాయో టెస్టింగ్ చేస్తుంటారని రఘురామరాజు అన్నారు.
గతంలో అమరావతిపై చిచ్చు రాజేసింది కూడా బొత్స సత్యనారాయణే అని… ఇలాంటి పనులు అన్నీ జగన్ ఏపీలో లేనపుడే బొత్స చేస్తూ ఉంటారని రఘురామరాజు కుండబద్దలు కొట్టారు.
కోర్టులపై బొత్స వ్యాఖ్యలు- కొత్త కాంట్రవర్సీ
మంత్రి బొత్స సత్యనారాయణ అమరావతి 29 గ్రామాల రాజధాని అని మాట్లాడటం ఏంటి? ఆయనకు ఏం మాట్లాడాలో ఇంకా తెలియకపోతే ఎలా? చట్ట పరిధిలో ఉన్న అంశాలపై ఇలా ఎందుకు మాట్లాడుతారు? అని ప్రశ్నించారు. ఏపీ మంత్రులకు, ఇతర వైసీపీ నేతలకు ఎంత దారుణమైన అభిప్రాయాలు ఉన్నాయో బొత్స తాజా వ్యాఖ్యలే ఉదాహరణ అన్నారు.
రైతులు 33వేల ఎకరాలు ఇస్తే ఇప్పుడు దుకాణం సర్థేస్తామంటే ఎలా; చట్టమెలా ఒప్పుకుంటుంది అని ప్రశ్నించారు. బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా మూడు రాజధానులు అంటారా? అని ప్రశ్నించారు.
మూడు రాజధానులు అనేది మతిలేని స్టేట్మెంట్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంద్రం విశాఖను రాజధానిగా పేర్కొందంటూ హడావిడి చేశారు… తీరా విషయం తెలిశాక తలెత్తుకోలేకపోయారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రశ్నలు అడుగుతుంటారు. అపుడు దొర్లిన చిన్న చిన్న తప్పులు పట్టుకుని ఇపుడు నాలుక కరుచుకున్నారన్నారు.