టాలీవుడ్ డ్రగ్స్ కేసు… ఇపుడు తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ.
గతంలో ఈ కేసు పెద్ద సంచలనం అయ్యింది.
అకున్ సబర్వాల్ అనే ఒక ఐపీఎస్ ఆఫీసరు దీనిని దర్యాప్తు చేసేవారు.
సడెన్ గా ఏమైందో ఏమో… ఆయన బదిలీ అయ్యారు. తర్వాత ఆ కేసు అలా మెత్తబడిపోయింది.
రేవంత్ రెడ్డి ఆ కేసును ఎందుకు వదిలేశారు… ఇందులో ఈడీ, సీబీఐని ఇన్వాల్వ్ చేయండి అని కేసు వేశారు.
అనేక విచారణల తర్వాత హైకోర్టు ఆదేశాలతో ఈడీ రంగంలోకి దిగింది.
అయితే, విచిత్రంగా కొంతకాలం తర్వాత కోర్టులో …. ఈడీ ఒక సంచలన పిటిషను వేసింది.
మేము దర్యాప్తు చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం అందడం లేదు అని ఈడీ ఆ పిటిషనులో పేర్కొంది. ఈ విషయాన్ని తాజాగా బయటపెట్టిన రేవంత్ రెడ్డి… కేటీఆర్ సన్నిహితులు ఉండటం వల్లే ఈ కేసును నీరు గారుస్తున్నారా? డ్రగ్స్ కేసు తెరపైకి రాగానే ఎందుకు కేటీఆర్ ఆందోళనగా ఉన్నారు? అంటూ పలు అనుమానాలు వ్యక్తంచేశారు.
దీనిపై రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇక్కడ స్వయంగా వినండి.