మీరు ఏపీ గురించి వచ్చే ఏ ప్రభుత్వ విభాగానికి సంబంధించిన వార్తలైన చదవండి. ఆ విభాగం హెచ్ వోడీ, ఛైర్మన్, ప్రెసిడెంట్… రెడ్డి గారే ఉంటారు. రెండేళ్లలే జగన్ ఈ అచీవ్ మెంట్ ఎలా సాధించారో ఎవరికీ అర్థం కాదు. ప్రభుత్వ కీలక పదవుల్లో మాత్రం బీసీలకు ఒక్క పదవీ రాదు. కోరల్లేని, పవరు లేని, నిధుల్లేని పదవులన్నీ జగనన్నయ బీసీలకే ఇస్తారు.
ఇదంతా ఒకెత్తు అయితే… రాజధానిని అమరావతి నుంచి విశాఖకు తరలింపును సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది ఎవరో తెలుసా… నిరంజన్ రెడ్డి గారు. ఆయనకు రూ.96 లక్షలు చెల్లించడానికి జోవో విడుదలయ్యింది. అంటే ప్రభుత్వం తాము చేసిన తప్పు నుంచి కూడా జగన్ సామాజిక వర్గం డబ్బులు సంపాదిస్తోంది.
మే 24న ఆయన ఫీజు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీచేసిన 239 జీవో పై హైకోర్టులో పిటిషను దాఖలయ్యింది. నిరంజన్‌రెడ్డికి రూ.96 లక్షలు ఫీజుగా చెల్లింపు ఏపీ న్యాయవాదుల ఫీజుల నిబంధన-43 ఉల్లంఘించేదిగా ఉందని పిటిషన్ సారాంశం.
హైకోర్టు లాయర్ చింతల విజయ్‌కుమార్ తరఫున న్యాయవాది వై.కమలారాణి ఈ పిటిషను వేశారు. చట్టవిరుద్ధమైన ఆ జీవోను కొట్టివేయాలని కోరారు. రాజధానిని తరలించే శాసనాధికారం ప్రభుత్వానికి లేదని పేర్కొంటూ ‘రాజధాని రైతు పరిరక్షణ సమితి’ రిట్ పిటిషన్, హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్లు వ్యతిరేకంగా వాదించిన నిరంజన్ రెడ్డి హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ విచారణకు హాజరు కాలేదని పిటిషనరు పేర్కొన్నారు.
అంతకంటే చాలా తక్కువ ఫీజుతోనే రాష్ట్రం తరఫున వాదనలు వినిపించేందుకు సీనియర్ లాయర్లు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తించడంలో అధికారులు విఫలమయ్యారని పిటిషనులో వివరించారు.
ఈ పిటిషనుపై జూన్ 10న హైకోర్టులో విచారణ జరగనుంది.
ప్రజల సొమ్ము లాయర్ల పాలు..????♂️
హైకోర్టులో 2 కేసులు ప్రభుత్వం తరఫున వాదించిన లాయర్ నిరంజన్ రెడ్డి గారికి అక్షరాల 96,00,000 ఫీజు చెల్లించిన జగన్ సర్కార్..????♀️ pic.twitter.com/3KqXiLgVjg— JSP Revolution Team (@JSP_Rev_Team) May 25, 2021
ప్రభుత్వం తరపున ప్రజలకు వ్యతిరేకంగా వాదించినందుకు అదే ప్రజల సొమ్మును ఫీజుగా ఇవ్వడం విచిత్రం అనుకుంటే… అది రూ.96 లక్షల భారీ చెల్లింపు కావడం ఇంకా విచిత్రం కదూ. రాజధాని అమరావతి కేసులు వాదించినందుకు లాయర్ ఎస్.నిరంజన్ రెడ్డికి ప్రభుత్వ ఖజానా నుంచి ఇస్తోన్న ఫీజు ఇది(1/2) pic.twitter.com/yhBB66soqG
— Telugu Desam Party (@JaiTDP) May 26, 2021