మనదేశంలో ఓటర్ల సంఖ్య సెంచరి దిశగా పరుగులు పెడుతోంది.
2022 లెక్కల ప్రకారం కేంద్ర ఎన్నికల కమీషన్ విడుదల చేసిన జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 95 కోట్లు దాటింది.
కచ్చితంగా ఓటర్ల సంఖ్యను చెప్పాలంటే 95,24,81,459. ఇందులో పురుషుల సంఖ్య 49,18,60931. ఇక మహిళా ఓటర్ల సంఖ్య 46,05,74,630. ట్రాన్స్ జెండర్ ఓటర్ల సంఖ్య 45,898.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఓటర్లను తీసుకుంటే ఏపీలో 4,07,36,279 కాగా తెలంగాణాలో 3,03,71,555.
2020 లెక్కలతో పోలిస్తే ఓటర్ల సంఖ్య 3.26 కోట్ల పెరిగింది. అంటే ఏడాదిలోనే సుమారుగా 3 కోట్లమంది యువజనులు తమ ఓట్లను నమోదు చేసుకున్నట్లు అర్ధమవుతోంది.
కాబట్టే తొందరలోనే దేశంలో ఓటర్ల సంఖ్య 100 కోట్ల మార్కును దాటిపోయే అవకాశముంది. మామూలుగా అయితే పురుషులతో పోలిస్తే మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది.
కానీ ఇఫుడు మాత్రం పురుషుల ఓటర్లు అంటే సుమారుగా 3 కోట్లమంది ఎక్కువగా ఉన్నారు.
అయితే 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రం మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి.
పాండిచ్చేరి, కేరళ, మణిపూర్, గోవా, మిజోరం, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, మేఘాలయలో మహిళా ఓటర్ల సంఖ్య పెరిగింది.
ఈ మొత్తంలో ప్రవాస ఓటర్లు 1,22,200 మంది అయితే సర్వీసు ఓటర్లు 19,12,708 మంది ఉన్నారు.
దేశం మొత్తం మీద అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 15,06,83879 మంది ఉన్నారు.
ఇక్కడ గమనించాల్సిందేమంటే యూరోపులోని మూడు నాలుగు దేశాల్లోని జనాబా ఒక్క యూపీలోనే ఉన్నారు.
పైగా ఇది కేవలం ఓటర్ల సంఖ్య మాత్రమే జనాభా కాదు. యూపీ తర్వాత మహారాష్ట్రలో 9.14 కోట్లు, బీహార్ 7.64, పశ్చిమబెంగాల్ 7.44, తమిళనాడు 6.32, మధ్యప్రదేశ్ 5.36, కర్నాటక 5.25, రాజస్ధాన్ 5.10, గుజరాత్ 4.85 కోట్ల మంది ఓటర్లున్నారు.
ట్రాన్స్ జెండర్ ఓట్లలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్నాటక, ఏపీలోనే ఎక్కువగా నమోదైంది.
మొత్తం మీద తొందరలోనే 100 కోట్ల ఓటర్ల మార్కును క్రాస్ చేయటం ఖాయం.