గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు మరో ఆరుగురు మాజీ ముఖ్యమంత్రులు నిన్న కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వారిలో కుమార స్వామి (కర్ణాటక), శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్య ప్రదేశ్), రాజ్నాథ్ సింగ్ (ఉత్తర ప్రదేశ్), మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), సర్బానంద సోనోవాల్ (అస్సాం), జితన్ రామ్ మాంఝి (బిహార్) ఉన్నారు. వీరిలో ఐదుగురు బీజేపీ మాజీ ముఖ్యమంత్రులు కాగా కుమారస్వామి జేడీఎస్, జితన్ రామ్ మాంఝి హిందుస్థాని ఆవామి మోర్చా పార్టీలకు చెందిన వారు.
కాగా, ఈ కేబినెట్ లో 33 మంది కొత్త వారికి కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కింది.బీజేపీ నుంచి తొలిసారి శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్). మనోహర్ లాల్ ఖట్టర్ (హరియాణా), కమలేష్ పాశ్వాన్ (ఉత్తర్ప్రదేశ్), రవ్నీత్ సింగ్ బిట్టు (పంజాబ్). రక్షా ఖడ్సే (మహారాష్ట్ర)సురేష్ గోపి (కేరళ)సుకాంత మజుందార్ (బంగాల్)దుర్గా దాస్ ఉకే (మధ్యప్రదేశ్)రాజ్ భూషణ్ చౌదరి (బిహార్)సతీష్ దూబే (బిహార్)సంజయ్ సేథ్ (ఝార్ఖండ్)సీఆర్ పాటిల్ (గుజరాత్)భగీరథ్ చౌదరి (రాజస్థాన్)హర్ష్ మల్హోత్రా (దిల్లీ)వి సోమన్న (కర్ణాటక)సావిత్రి ఠాకూర్ (మధ్యప్రదేశ్)ప్రతాప్రావు జాదవ్ (మహారాష్ట్ర)జార్జ్ కురియన్ (కేరళ)కీర్తి వర్ధన్ సింగ్ (ఉత్తర్ప్రదేశ్)భూపతి రాజు శ్రీనివాస వర్మ (ఆంధ్రప్రదేశ్)నిముబెన్ బాంబ్నియా (గుజరాత్)మురళీధర్ మోహోల్ (మహారాష్ట్ర)పబిత్రా మార్గరీట (అసోం)బండి సంజయ్ కుమార్ ( తెలంగాణ) లు ఉన్నారు.
మిత్ర పక్షాల నుంచి తొలిసారి కె రామ్మోహన్ నాయుడు (టీడీపీ)చంద్రశేఖర్ పెమ్మసాని (టీడీపీ)లాలన్ సింగ్ (జేడీయూ)రామ్నాథ్ ఠాకూర్ (జేడీయూ)జయంత్ చౌదరి(ఆర్ఎల్డీ)చిరాగ్ పాసవాన్ (ఎల్జేపీ)హెచ్డీ కుమారస్వామి (జేడీ(ఎస్) లు కేంద్రమంత్రులు అయ్యారు.