• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

బెంగాల్ లో తాజా పోలింగ్ వేళ జరిగిన కాల్పుల్లో 5 మృతి.. ఎందుకు?

పోలింగ్ వేళ పోలీసుల కాల్పులు.. 5 మృతి.. బెంగాల్ లో అలాంటి పరిస్థితి ఎందుకు?

admin by admin
April 11, 2021
in India, Politics, Top Stories
0
0
SHARES
109
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
శనివారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. బెంగాల్ లో పెద్ద ఎత్తున దశల వారీగా జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఊహించని రీతిలో హింస జరుగుతోంది. తాజాగా జరిగిన పోలింగ్ వేళ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మృత్యువాత పడటం షాకింగ్ గా మారింది. కూచ్ బిహార్ జిల్లా సితాల్ కుచి నియోజకవర్గ పరిధిలో ఒక పోలింగ్ కేంద్రం వెలుపల కేంద్ర పారిశ్రామిక భద్రత దళం కాల్పులు జరపగా.. నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.
ఇదే నియోజకవర్గంలో తొలిసారి ఓటుహక్కును సొంతం చేసుకున్న యువకుడ్ని.. గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపటం మింగుడుపడనిదిగా మారింది.కాల్పుల్ని పశ్చిమబెంగాల్ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. దీనిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై సీఐడీ విచారణ జరుపుతామని.. కాల్పుల్లో మరణించిన నలుగురు కార్యకర్తలు తమ పార్టీకి చెందిన వారుగా మమత పేర్కొన్నారు. 294 నియోజకవర్గాలున్న బెంగాల్ రాష్ట్రంలో శనివారం 44 స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఇంతకీ భద్రతా సిబ్బంది కాల్పులు జరిపే పరిస్థితి ఎందుకు వచ్చింది? నలుగురు ప్రాణాలు కోల్పోయంతలా పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయి? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ప్రత్యక్ష సాక్ష్యలు వివిధ మీడియా సంస్థలకు అందించిన సమాచారం ప్రకారం సితాల్ కుచి నియోజకవర్గంలో ఒక పోలింగ్ కేంద్రం వద్ద ఓటర్లను చెదరగొట్టటానికి కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. దీంతో.. ఘర్షణ మొదలైంది. ఈ క్రమంలో స్థానిక పోలీసుల నుంచి తుపాకులు లాక్కునే ప్రయత్నం జరిగింది.
ఒక వాహనం ధ్వంసం చేశారు. దీంతో.. జవాన్లు కాల్పులు జరిపినట్లుగా సీనియర్ పోలీసు అధికారులు వెల్లడించారు. కాల్పుల నేపథ్యంలో పోలింగ్ నిలిపివేసినట్లుగా ఎన్నికల సంఘం పేర్కొంది. అయితే.. ఈ వాదనకు భిన్నంగా మరో రెండు వాదనలు వినిపిస్తున్నాయి,అందులో ఒకటి.. పోలింగ్ వేళ.. పడిపోయిన వ్యక్తికి భద్రతా సిబ్బంది సపర్యలు చేస్తుండగా.. భద్రతా వర్గాల చేతుల్లో ప్రాణాలు కోల్పోయినట్లుగా ప్రచారం జరగటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
అదే సమయంలో తోపులాటలో ఒక చిన్నారికి గాయాలు కావటం కూడా హింసకు కారణమైందని చెబుతున్నారు. బెంగాల్ లో మరో నాలుగు దశల్లో పోలింగ్ జరగాల్సి ఉంది. ప్రస్తుతం నెలకొన్న పరిణామాల నేపథ్యంలో మరో 71 కంపెనీల అదనపు సాయుధ బలగాల్ని పంపాలని ఈసీ కేంద్ర హోం శాఖను ఆదేశించింది. ఈ కాల్పులు ఉదంతంపై ప్రధాని మోడీ వర్సెస్ సీఎం మమతల మధ్య మాటల యుద్ధం జరగటమే కాదు.. ఇరువురు ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాల్ని సంధించుకున్నారు. ఏం.. జరిగినా ఐదు ప్రాణాలు పోవటం దారుణమని చెప్పక తప్పదు.
Tags: 5 people killedcrpf police firingreason behind violence in bengalwest bengal polling
Previous Post

ఐఎంఎస్ స్కామ్ లో నాయిని అల్లుడు…

Next Post

ఇదే జోరు సాగితే రోజుకు మిలియన్ కేసులు ఖాయం

Related Posts

KCR Jagan Telangana Andhra Pradesh
Top Stories

రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

June 3, 2023
Trending

రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!

June 3, 2023
Trending

ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది

June 3, 2023
Top Stories

‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?

June 2, 2023
Top Stories

విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు

June 2, 2023
Top Stories

పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!

June 2, 2023
Load More
Next Post
CoronaVirus in India

ఇదే జోరు సాగితే రోజుకు మిలియన్ కేసులు ఖాయం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!
  • రాళ్లు, కోడిగుడ్ల‌తో టీడీపీని ఎలా ఓడిస్తావ్ జ‌గ‌నూ..!
  • ఒడిశా ఘోర రైలు ప్రమాదంలో షాకింగ్ నిజమిది
  • NTR-శక పురుషునికి ‘డెట్రాయిట్’ శత జయంతి నీరాజనం!
  • ‘దేవుడి స్క్రిప్టు’ మాట బాబు కంటే జగన్ నే వెంటాడుతోందా?
  • బైడెన్ కు వణుకు పుట్టించి.. చివర్లో రిలీఫ్ ఇచ్చిన సెనేట్
  • విడిపోయి 9 ఏళ్లయినా ఏపీ రాజధానేదో తెలీదు: చంద్రబాబు
  • పవన్ వారాహి యాత్ర ఫిక్స్..డేట్ ఇదే!
  • బాలినేని, జగన్ ల భేటీకి వైవీ డుమ్మా!
  • ఆ జీవో కొట్టివేత..జగన్ కు సుప్రీం షాక్
  • లోకేష్ పై దాడి…బోండా ఉమ డెడ్లీ వార్నింగ్
  • ఆ దర్శకులు మాట తప్పారంటున్న అల్లు అరవింద్
  • ప్ర‌క‌ట‌న‌లేనా..చేసేదేమైనా ఉందా జ‌గ‌న్‌ ? గుంటూరు ప్ర‌జ‌ల ప్ర‌శ్న‌
  • ఆ సర్వేలో అట్టడుగున ఏపీ..చంద్రబాబు ఫైర్
  • తెలంగాణ ఉద్యమాన్ని ఆంధ్రా పాలకులు తొక్కేశారు:కేసీఆర్

Most Read

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

రివెంజ్ కోసం రూ.15 కోట్లు ఖర్చు చేసి సినిమా తీయటం ఎందుకు?

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

రాజధాని వైజాగ్ అయితే.. పేదలకు ఇళ్లు అక్కడ ఇవ్వాలి కదా?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra