ఒకటి..రెండు..మూడు..నాలుగు…పదకొండు….ఇవేవో చైతన్య, నారాయణ విద్యా సంస్థలు విద్యార్థుల ర్యాంకులు ప్రకటిస్తున్న ప్రకటన అనుకుంటున్నారా? అయితే, మీరు పప్పులో కాలు వేలు వేసినట్లే. ఏపీలో త్వరలో జరగబోతోన్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి విజయ భేరి మోగించడం ఖాయం అని ముక్త కంఠంతో 11 సర్వేలు చెబుతున్న వైనం ఇది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి ఓటమి తప్పదని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 11 జాతీయ స్థాయి సర్వే సంస్థలు తేల్చి చెప్పాయి.
తాజాగా విడుదలైన ఏబీపీ సీ ఓటర్ సర్వే సహా 10 సర్వేలు కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఏపీలో బీజేపీ, జనసేన, టీడీపీ కూటమికి 25 లోక్ సభ స్థానాలకు గాను 20 స్థానాలు వస్తాయని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడైంది. వైసీపీ 5 స్థానాలకు పరిమితం అవుతుందని తేలింది. ఎన్డీఏ కూటమికి 47% ఓట్లు, వైసీపీకి 40 శాతం ఓట్లు, కాంగ్రెస్ కు 2 శాతం ఓట్లు, ఇతరులకు 11 శాతం ఓట్లు వస్తాయని, వైసీపీ ఈసారి 17 స్థానాలు కోల్పోబోతుందని ఏబీపీ సీ ఓటర్ సర్వేలో తేలింది.
ఇండియా టుడే సర్వేలో కూటమికి 17 సీట్లు రాగా, వైసీపీకి 8 సీట్లు వచ్చాయి. సీఎన్ఎన్ న్యూస్ సర్వేలో కూటమికి 18 సీట్లు, వైసిపికి 7 సీట్లు…ఇండియా టీవీ సర్వేలో కూటమికి 17 సీట్లు వైసీపీకి 8 సీట్లు, న్యూస్ ఎక్స్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జన్మత్ పోల్స్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8, స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ సర్వేలో కూటమికి 23, వైసీపీకి 2… పీపుల్స్ సర్వేలో కూటమికి 23 వైసీపీకి 2, పయనీర్ పోల్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7… ఇండియా న్యూస్ సర్వేలో కూటమికి 18, వైసీపీకి 7, జీ న్యూస్ సర్వేలో కూటమికి 17, వైసీపీకి 8 లోక్ సభ స్థానాలు దక్కబోతున్నాయని సర్వేలలో తేలింది.
11 సర్వేలు ఎన్డీఏ కూటమి ఏపీలో విజయం సాధిస్తుందని ధీమాగా ఉన్నాయి. తాజా సర్వేతో తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
సర్వేలన్నీ కూడా.. జగన్మోహన్ రెడ్డి ఇక నీ పని అయిపోయింది అని చెప్తున్నాయి. #TDPJSPBJPWinning #Jarugujagan_NippulantiBabu #AndhraPradesh pic.twitter.com/TJRgSqfMc2
— Telugu Desam Party (@JaiTDP) April 17, 2024