మనుషుల సంగతి కాసేపు పక్కన పెట్టేద్దాం. జంతువుల వద్దకు వెళదాం. ఆకలి తీర్చుకోవటానికి ఆహారంగా కనిపించే ప్రాణిని చంపేస్తుంది. అలాంటి జంతువు సైతం.. సెక్స్ చేసేటప్పుడు మాత్రం.. తన భాగస్వామిని మచ్చిక చేసుకున్న తర్వాతే శృంగారం చేస్తుంది. ఈ లెక్కన చూస్తే మనిషి కంటే మృగమే చాలా బెటర్ అనిపించక మానదు. ఎంత కర్కశ జంతువైనా సరే.. తన కామం తీర్చుకోవటం కోసం రేప్ మాత్రం చేయదు. కానీ.. బుద్ధిజీవి అయిన మనిషి మాత్రం అందుకు భిన్నంగా.. తన పశుత్వంతో తాను కన్నేసిన అమ్మాయిని అనుభవించటానికి చేసే దారుణం అంతా ఇంతా కాదు.
ఇలాంటి వారిని ఈ నాగరిక సమాజంలో ఏం చేయాలి? వారికి ఎలాంటి శిక్ష విధించాలి? అన్నప్పుడు బతికిన ప్రతి క్షణం వేదనతో బతకాలంటే రెండు కాళ్లు.. రెండు చేతులు నరికేయాలి. కాదు.. అంతటి పైశాచికమంటే.. ఉరిశిక్ష విధించాలి. ప్రస్తుతం నడుస్తున్న డిజిటల్ యుగంలో అయినా.. మనిషి అత్యాచారాన్ని అధిగమించాలి.
బ్యాడ్ లక్ ఏమంటే.. కాలం గడిచే కొద్దీ అత్యాచారాలు చేయటం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఇలాంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిన న్యాయమూర్తి అత్యంత దారుణమైన తీర్పును ఇచ్చిన వైనం.. ఆ దేశంలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతకూ ఏం జరిగిందంటే.. అత్యాచారం చేసిన వాడి కేసును విచారించిన ఒక న్యాయమూర్తి.. నిందితుడు బాధితురాలిపైన పదకొండు నిమిషాల పాటే అత్యాచారం చేసినందుకు తక్కువ శిక్ష విధించాలన్న మాట విన్నంతనే ఒళ్లు మండుతుంది.
ఇంత దారుణమైన తీర్పు ఇచ్చింది నాగరిక సమాజంగా చెప్పే స్విట్జర్లాండ్ దేశంలోని ఒక న్యాయమూర్తి. ఈ తీర్పు గురించి విన్నవాళ్లంతా ఆ న్యాయమూర్తిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేస్తున్నారు. అత్యాచారం లాంటి దారుణమైన నేరానికి సంబంధించి ఇలాంటి మతి లేని తీర్పు ఇవ్వటమా? అని ప్రశ్నిస్తున్నారు. తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. స్విట్జర్లాండ్ వాయువ్య ప్రాంతం పరిధిలోని ఒక నగరానికి చెందిన బాధితురాలిని గత ఏడాది ఫిబ్రవరిలో పోర్చుగల్ కు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ఆమె ప్లాట్ లో రేప్ చేశాడు.
ఈ దారుణానికి పదిహేడేళ్ల వయసున్న మరో మైనర్ కూడా సహకరించాడు. దీంతో.. బాధితురాలు తనకు జరిగిన అన్యాయం గురించి పోలీసులకు ఫిరర్యాదు చేసింది. దీంతో.. వారిని కోర్టుకు హాజరుపరచగా..చేసిన నేరానికి గాను గత ఏడాది ఆగస్టులో కోర్టు శిక్ష విధించింది. 31 ఏళ్ల వ్యక్తికి నాలుగేళ్ల మూడు నెలలు జైలుశిక్ష వేయగా.. మైనర్ ను మాత్రం జువైనల్ హోంకు తరలించారు.
విచారణలో భాగంగా న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు.. విధించిన శిక్షపై ఆ దేశంలో ఇప్పుడు ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. బాధితురాలు కొన్నితప్పుడు సంకేతాలు పంపి.. నిప్పు రాజేసిందన్నారు. అత్యాచారం జరిగిన రోజున ఆమె మరో వ్యక్తితో కలిసి నైట్ క్లబ్ కు వెళ్లి ఎంజాయ్ చేసిందని.. ఇవన్నీ నిందితుడిపై ప్రభావం చూపినట్లుగా పేర్కొన్నారు జస్టిస్ హెంజ్. నిందితుడు చేసిన రేప్ ను మధ్యస్తనేరంగా అభివర్ణించారు.
అంతేకాదు.. అత్యాచారం పదకొండు నిమిషాల పాటే సాగిందని.. ఈ ఘటనలో బాధితురాలికి ఎక్కువగా గాయాలు కాలేదని.. అందుకే అతడికి శిక్ష తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ తీర్పుపై స్విట్జర్లాండ్ వాసులు మండిపడుతున్నారు. నిజమే.. రేప్ కు తీవ్రమైనది.. మధ్యస్తమైనది.. స్వల్పమైనదన్న వర్గీకరణ ఏమిటి? ఈ ఉదంతం గురించి మొత్తంగా వింటే రేప్ చేసిన నిందితుడిని మాత్రమే కాదు.. తీర్పు ఇచ్చిన న్యాయమూర్తిని కూడా అంత తేలిగ్గా వదలకూడదన్న భావన కలుగక మానదు. రేప్ అంటే.. అదేమీ టీజ్ చేయటం కాదు.. శారీరకంగా హింసకు గురి చేయటం. అది కూడా జీవించినంత కాలం వెంటాడుతూనే ఉంటుంది. ఈ తీరని మానసిక.. శారీరక గాయానికి కఠిన శిక్ష విధించాల్సింది పోయి.. బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయటమా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.