నోరు విప్పితే… విలువలు-విశ్వనీయత గురించి మాట్లాడే.. వైసీపీ అధినేత జగన్‌పై ఇప్పుడు సోషల్ మీడి యాలోగట్టి సెగే తగులుతోంది. “ఇదేనామీ విశ్వసనీయత?“ అంటూ ప్రశ్నల పరంపర ఎదురవుతోంది.
దీనికి కారణం.. త్వరలోనే జరుగుతాయని భావిస్తున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవాలైన చోట.. నాయకులపై వత్తిళ్లు పెంచడమే.
గత ఏడాది ప్రారంభమై.. మధ్యలో కరోనా నేపథ్యంలో నిలిచిపోయిన పరిషత్ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఏకగ్రీవాలు అయ్యాయి. వీటిలో ఓ 5 చోట్ల టీడీపీ కూడా ఏకగ్రీవాలు చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఇలా టీడీపీ చేసుకున్న ఏకగ్రీవాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ నాయకులు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.
కృష్ణాజిల్లా నందిగామ పరిషత్‌లో టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. ఇక్కడ మాజీ మంత్రి దేవినేని ఉమా చక్రం తిప్పి.. దీనిని టీడీపీకి అనుకూలంగా మార్చారు.
ఇక, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జడ్పీటీసీని కూడా టీడీపీ ఏకగ్రీవం చేసుకుంది. అయితే.. ఈ రెండు స్థానాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు వైసీపీ నాయకులు వత్తిళ్లు తెస్తున్నారు.
డబ్బు ఆశ చూపుతున్నారు.. లేదా కేసుల పేరిట వేధించేందుకు రెడీ అయ్యారు.
దీంతో ఈ విషయం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇదేనా మీ విశ్వసనీయత.. వైసీపీ విలువలు.. అంటూ. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు మండి పడుతున్నారు.
ఇతర పార్టీల్లో గెలిచిన అభ్యర్థులను పార్టీలో చేర్చుకోబోమని ప్రకటించిన జగన్… లోపాయికారీగా .. తనకు అనుకూలంగా మార్చుకుని ఏనాడో.. విశ్వసనీయతకు తూట్లు పొడిచారని… 25 మంది ఎంపీలను ఇస్తే.. కేంద్రం మెడలు వంచుతానని తానే ఒంగిపోయారు.. అమరావతిని కుళ్ల బొడిచి.. ఆంధ్రులకు కేరాఫ్ లేకుండా చేస్తున్నారు. ఇదేనా.. మీ విలువలతో కూడిన రాజకీయం? అని ప్రశ్నిస్తున్నారు.
వాస్తవానికి ఇవన్నీ.. ఎప్పటి నుంచో ట్రోల్ అవుతున్నారు. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ ఏకగ్రీవాలను కూడా తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తుండడంపై నెటిజన్లు మండిపడుతుండడం గమనార్హం.