ఏపీ అధికార పార్టీ వైసీపీని మరోసారి గెలిపించాలని.. కుదిరితే.. దేవుడు చల్లగా చూస్తే.. అక్కచెల్లెమ్మలు ఆశీర్వదిస్తే.. వచ్చే 30 ఏళ్లపాటు కూడా.. వైసీపీనే అధికారంలో ఉండాలని.. సీఎంగా జగనే కొలువు దీరాలని.. ఆ పార్టీ నాయకులు చెబుతున్న విష యం తెలిసిందే.
అయితే.. నాయకుల మాట ఎలా ఉన్నా.. జనం మాటేంటి? జనాలు ఏం కోరుకుంటున్నారు? వారు ఓట్లేస్తేనే కదా.. ఏ నాయకుడైనా.. గెలిచేది.. గద్దె ఎక్కేది! సో.. మరి వారి నాడి ఎలా ఉంది.. ? అనేది ఆసక్తిగా మారింది.
ఇటీవల ఓ సంస్థ దీనిపై దృష్టి పెట్టింది. వచ్చేఎన్నికల్లో జగన్ను గెలిపిస్తారా.. ఏం జరుగుతుందనే విషయాన్ని ప్రజలను ప్రశ్నించింది.
దీనికి ప్రజల నుంచి ఆసక్తికర సమాధానాలు వచ్చాయి. కొందరు గెలిపిస్తే.. తప్పులేదని.. అనగా.. మెజారిటీ ప్రజలు మాత్రం.. అప్పుల విషయంలో తర్జన భర్జన పడుతున్నారు.
అప్పులు చేయకుండా.. హామీ ఇవ్వగలరా? అనేది మెజారిటీ ప్రజలు అడుగుతున్న ప్రశ్న. వీరిలో మేధావులు, మధ్య తరగతి ప్రజలు ఎక్కువగా ఉన్నారు. ఇలా ఆలోచించడాన్ని ఎవరూ తప్పు కూడా పట్వారికి సంక్షేమలను అభ్యున్నతిలోకి తీసుకువచ్చేందుకు వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సిందే.
కానీ, ఇవి రాజకీయ సంక్షేమంగా మారడాన్ని వారు ప్రశ్నిస్తున్నారు.
ఎందుకంటే.. రాష్ట్రంలో 3 కోట్ల మంది ప్రజలు కడుతున్న పన్నుల నుంచి.. లేదా చేస్తున్న అప్పుల నుంచి కేవలం ఓ 70 నుంచి 80 లక్షల మంది(వీరిలో అన్ని రకాల వారు ఉన్నారు) మాత్రమే సొమ్ములు ఇవ్వడం.. ఇతర కోట్లాది మంది నుంచి వివిధ రూపాల్లో పన్నులు పిండడం ఏంటనేది.. వారి ప్రశ్న.
అయితే.. ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు వద్దని కానీ.. వాటి వల్ల ఏదో జరిగిపోతోందని కానీ.. వారు చెప్పడం లేదు. కానీ, మితిమీరి చేయడాన్ని వారు తప్పుబడుతున్నారు.
అవసరం లో ఉన్న వారికి సాయం చేయడం తప్పుకాదని..కానీ, ఇచ్చుకుంటూ.. పోతే.. దీనికి అంతు ఎక్కడని అంటున్నారు.
ఇక, మరికొందరు.. మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే.. మరిన్ని అప్పులు చేయడం ఖాయమని చెబుతున్నారు.
అంతేకాదు.. ప్రస్తుతం చేసిన అప్పులు తీర్చేందుకు.. కొత్తగా చేయబోయే అప్పులకు.. కూడా ప్రజలను మరింత బాదడం ఖాయమని కూడా వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో మెజారిటీ ప్రజల అభిప్రాయం చూస్తే.. చేతికి ఎముక లేకుండా.. సర్కారు చేస్తున్న సంక్షేమాన్ని వారు స్వాగతించడం లేదనే చెప్పాలి.
దీనిని బట్టి.. వైసీపీ మళ్లీ గట్టెక్కుతుందా.. లేదా.. అనేది.. చూడాలి.