విశాఖపట్నంపై అధికార వైసీపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. కార్యనిర్వాహక రాజధానిగా విశాఖనే ఉంటుందని వైసీపీ ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కూడా మకాన్ని వైజాగ్‌కు మార్చే ఆలోచనలో ఉన్నారు. దీంతో రాజకీయ పరంగానూ విశాఖపై వైసీపీ గురి పెట్టింది. విశాఖ ఎంపీ సీటుకు కాపాడుకోవాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందుకే ఈ సారి ఎవరూ ఊహించని విధంగా అభ్యర్థి విషయంలో వైసీపీ ట్విస్ట్ ఇవ్వనుందని సమాచారం.
ప్రస్తుతం విశాఖ ఎంపీగా వైసీసీ నాయకుడు ఎంవీవీ సత్యనారాయణ ఉన్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో ఆయన్ని జగన్ మారుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ సారి ఎన్నికల్లో బీసీ కార్డుతో వైసీపీ ముందుకు వెళ్లాలని చూస్తోందని టాక్. అందుకే అక్కడే ఎమ్మెల్సీగా ఉన్న వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌ను ఎంపీగా పోటీ చేయించాలని జగన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. విశాఖ పార్లమెంట్ స్థానం పరిధిలో బీసీలు దాదాపు 70 నుంచి 80 శాతం వరకూ ఉన్నారు. అందుకే వంశీ క్రిష్ణ శ్రీనివాస్‌ను జగన్ బరిలో దించుతారని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మరోవైపు సిట్టింగ్ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను విశాఖ తూర్పు నుంచి ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలో దించేందుకు జగన్ చూస్తున్నారని తెలిసింది. అక్కడ వరుసగా మూడు సార్లు గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుకు సత్యనారాయణతో చెక్ పెట్టాలన్నది జగన్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ నియోజకవర్గం నుంచి వంశీక్రిష్ణ.. 2009లో ప్రజారాజ్యం తరపున, 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. అందుకే ఈ నియోజకవర్గంలో సత్యనారాయణను దించి.. అక్కడ ఎంపీ స్థానంలో వంశీక్రిష్ణను నిలబెట్టేందుకు జగన్ కసరత్తులు చేస్తున్నారని టాక్.