ఏపీలో రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయని అంటున్నారు పరిశీలకులు. నిజానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రాజకీయాలు ఉన్నప్పటికీ..ఏపీలో ఉన్నంత ఆసక్తి, ఏపీ రాజకీయాలపై నడుస్తున్నంత చర్చ.. ఎక్కడా ఏ రాష్ట్ర రాజకీయాలపైనా జరగడం లేదు.
ఏపీలో ఏం జరిగినా.. పొరుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నారు పరిశీలకులు. ఇక, రాజకీయ విశ్లేషకులు అయితే.. జరుగుతున్న పరిణామాలకు వెనుక ఉన్న తీగలను లాగుతున్నారు.
ఇప్పుడు తాజాగా టీడీపీ సీనియర్ నాయకుడు, ఫైవ్ టైమ్స్ ఎమ్మెల్యే.. ప్రస్తుతం మాజీ అయిన.. ధూళిపాళ నరేంద్ర కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
సరే! వారు చెబుతున్న రీజన్ వారికి ఉన్నప్పటికీ.. విశ్లేషకులు మాత్రం..ఈ అరెస్టు వెనుక ఉన్న మరో కోణాన్ని బయటకు తీశారు.
అదేంటంటే.. జగన్ సర్కారును కార్నర్ చేస్తున్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బాబుగారి కుమారుడు నారా లోకేష్ నోరు మూయించేందుకే.. జగన్ సర్కారు ఇలా `ఏసీబీ` అనే అస్త్రాన్ని ప్రయోగిస్తోందని అంటున్నారు. అదే కేంద్ర ప్రభుత్వం అయితే.. తనకు నచ్చని నేతలను, తనను విమర్శిస్తున్న నేతలపై సీబీఐని ప్రయోగించినట్టన్నమాట.. అంటున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా తీవ్రంగా ఉందని.. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ కొంపలు ఆర్పేస్తోందని.. యువత నుంచి చిన్నారుల వరకు ఈ వైరస్ వదిలి పెట్టడం లేదని.. సో.. పదోతరగతి, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి.. విద్యార్థుల ప్రాణాలకు గొడుగు పట్టాలని.. నారా లోకేష్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
ప్రజల పట్ల కనీస బాధ్యత ఉన్న ఏపార్టీ అయినా.. నాయకుడు అయినా.. ఈ డిమాండ్ చేయడం తప్పుకాదు.. చేయకపోతేనే తప్పు! అయితే.. జగన్ సర్కారుకు ఇలాంటి హితోపదేశాలు నచ్చడం లేదు.
“బాధ్యతాయుత ప్రతిపక్షంగా సలహాలు ఇవ్వడం లేదని` నెత్తీ నోరూ మొత్తుకునే వైసీపీ నేతలకు మరి ఈ సూచనలో బాధ్యత లేదని అనుకున్నారో ఏమో.. అంటున్నారు పరిశీలకులు.
లేదా.. వారికి నచ్చని.. వారికి ఇరుకున పెడుతున్న ఇలాంటి సలహాలు ఇవ్వకూడదని భావించారో ఏమో.. వెంటనే వారి అమ్ముల పొదిలోని ఏసీబీ అస్త్రాన్ని టీడీపీపై ప్రయోగించారని పరిశీలకులు, విశ్లేషకులు చెబుతున్నారు.
లోకేష్ నోరు మూయించేందుకు.. లేదా టీడీపీని కట్టడి చేసేందుకు వ్యూహాత్మకంగా ఏసీబీని రంగంలోకి దించి.. సీనియర్ నాయకుడు.. ధూళిపాళ్లను `సంగం డెయిరలో అవకతవకల` పేరిట అరెస్టు చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
నిజానికి ఇలాంటి చర్యలు.. ప్రజాస్వామ్యంలో సరికావని చెబుతున్నారు. ఏదైనా ఉంటే.. ముఖాముఖి తేల్చుకోవాలే.. తప్ప..ప్రజాస్వామ్యంలో పిల్లవ్యవహారాలను ప్రజలు నవ్విపోతారని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ప్రభుత్వం ఏమంటుందో చూడాలి.