బాబు అంతుచూస్తాం.. అని కేటీఆర్ ఎందుకన్నారు?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై టీఆర్ఎస్ కీలక నేత కల్వకుంట్ల తారక రామారావు చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ వైపు బాబుపై కేసీఆర్ విరుచుకుపడుతుంటే.. మరోవైపు కొడుకు కేటీఆర్ విమర్శలు గుప్పిస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. తెలంగాణలో బాబు జోరు చూసి భయపడే గులాబీ పెద్దలు ఇలా మాట్లాడుతున్నారా? అనే కోణంలో ఊహాగానాలు మొదలయ్యాయి.

చంద్రబాబు నాయుడు అనవసరంగా తెలంగాణలో జోక్యం చేసుకుంటున్నారని కేటీఆర్ మండిపడటం వెనుక అర్థమేమిటని అంటున్నారు కొందరు. పుట్టలో వేలు పెడితే చీమ అయినా కుడుతుందని.. అలాంటిది తెలంగాణలో వేలు పెట్టిన చంద్రబాబును ఏం చేయాలని ప్రశ్నించటం, చంద్రబాబు సంగతి చూస్తామని వ్యాఖ్యానించటంలో అసలు సారాంశం ఏంటని చర్చించుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. అవసరమైతే ఆంధ్రాలో ముఖ్యమంత్రి కేసీఆర్ వేలు పెట్టడానికి వెనుకాడబోరని, తాము ప్రశాతంగా ఉందామనుకుంటే.. చంద్రబాబు తమతో గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారని కేటీఆర్ గొంతెత్తి వ్యాఖ్యానించారు. అయితే ఇది చూసిన విశ్లేషకులు మాత్రం.. తెలంగాణ రాష్ట్రంలో బాబు పోటీచేయొద్దు అనేదే కేటీఆర్ అంతరార్థం అని తెలుస్తోందని అంటున్నారు. ఎన్నిఅన్నా బాబు ఊరికే ఉంటున్నాడని ఇలా బెదిరించటం ఏంటి? అని ఇంకొందరు చెప్పుకుంటున్నారు.

ఒకరకంగా చూస్తే.. ఇది ఆలోచించాల్సిన విషయమే అనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ స్థానాలే పోటీ చేస్తున్న సైకిల్ పార్టీ.. ప్రజాకూటమిలో కీలకంగా మారటమే దీనికి కారణం. ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో బాబుకు బలం పెరుగుతుండటం, ఊహించని రీతిలో తెలంగాణ ప్రజలు ఆయనను స్వాగతించటం గులాబీ వర్గాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుందేమో! అందుకే ఇలా మాట్లాడుతున్నారు అనేది జనం మాట.

1 Comment

  1. కేటిఆర్ మాట్లాడే విధానం చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లుగా ఉంది. తెలంగాణకు తామే పేటెంట్ అని కేసీఆర్ కుటుంబసభ్యులు భావిస్తన్నట్లున్నారు. తెలంగాణ లోని రేవంత్ రెడ్డి, కోదండరాం, పురుషోత్తమ రెడ్డి,ఎల్.రమణ వంటి వారు తెలంగాణలోని నాయకులు కాదా ? పరిపాలించే అర్హత లేని వారా ? కేటీఆర్ లాంటి వారి ఉడుత ఊపులకు చంద్రబాబు బెదరుతారా ?!

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.