Why not ? #YuvaGalamPadayatra pic.twitter.com/83KaE8S5hg
— iTDP Official (@iTDP_Official) February 9, 2023
యువగళం పాదయాత్ర చేస్తున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ 15 వరోజు వినూత్నంగా కనిపించారు. చిత్తూరు జిల్లా పాలసముద్రం మండలం రేణుకాపురం నుంచి ప్రారంభమైన యాత్రలో.. యువత, పార్టీ నాయకులు, శ్రేణులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
గంగాధర నెల్లూరు నియోజకవర్గం శ్రీరంగరాజపురం మండలం రాణిపురం వద్ద లోకేష్.. నాగలి పట్టి పొలం దున్నారు. మడిలోకి దిగి.. పొలాన్ని తొక్కి చూశారు. ఆ బురదలోనే అడుగులు వేస్తూ.. రైతులతో మాట్లాడి.. వారి సమస్యలను తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.., జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఏపీలో జగన్ పాలనలో జే ట్యాక్స్‌కు భయపడి పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు పక్కరాష్ట్రాలకు పారిపోతున్నారని లోకేష్ దుయ్యబట్టారు. వైసీపీ కక్ష సాధింపునకు అమరరాజా పరిశ్రమ తరలిపోయిందన్నారు. దీనివల్ల రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని వ్యాఖ్యానించారు.
చిత్తూరు జిల్లాలో అమరరాజా పరిశ్రమ వెళ్లిపోవడం వల్ల దాదాపు 20 వేల మంది రాయలసీమ యువత ఉద్యోగ అవకాశాలు కోల్పోయారని నారా లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. అనంతపురంలో జాకీ పరిశ్రమను కూడా అక్కడ ఎమ్మెల్యే కమీషన్ల కోసం ఒత్తిడి చేసి తరిమేశారని ఆరోపించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక 10లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయాయని విమర్శించారు. సొంత ప్రయోజనాలు, అవినీతి సొమ్ము కోసం జగన్ రాష్ట్ర ప్రయోజనాలు, యువత భవిష్యత్తును బలి పెట్టారని మండిపడ్డారు.
టీడీపీ అధికారంలోకి రాగానే రీబిల్డ్ ఏపీ పేరుతో రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని చెప్పారు. వైసీపీ పాలనలో దళితులపై దాడులు ఎక్కువయ్యాయని నారా లోకేష్ ఆరోపించారు. దేశంలో ఎక్కడా ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టలేదు మన రాష్ట్రంలో మాత్రం అందుకు విరుద్ధంగా పాలన ఉందన్నారు. దళితుల భూములు దోచుకుంటున్నారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలు లాక్కున్న భూములను తిరిగి అప్పగిస్తామన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై కేసులు పెడుతున్నారని లోకేష్ మండిపడ్డారు.
చిల్లర కోసం చిప్పకూడు తిన్న తాడేపల్లి దేశ ద్రోహుల బూట్లు నాకే శునకమా @RGVzoomin..ఇదిగో ఇక్కడ ఉన్నాడు ???? https://t.co/IcA9rc1N1q pic.twitter.com/8M1susnsnR
— iTDP Official (@iTDP_Official) February 9, 2023