కేంద్ర మంత్రివర్గంలో రెండుమూడు రోజుల్లో భారీ మార్పులు జరగబోతున్నట్లు సమాచారం. ఇది కాగానే వెంటనే పార్టీని కూడా ప్రక్షాళనచేయాలని నరేంద్రమోడీ డిసైడ్ అయ్యారట. ప్రక్షాళనలో భాగంగానే తెలంగాణా, ఏపీ శాఖలకు అధ్యక్షులను మార్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పార్టీవర్గాలు చెబుతున్నాయి. పార్టీవర్గాల సమాచారం ప్రకారం ఏపీ అధ్యక్షుడిగా సోమువీర్రాజును తప్పిస్తారట. ఆయన స్ధానంలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ ను నియమించాలని అనుకుంటున్నారట.
పార్టీ అధ్యక్షమార్పు జరగగానే వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు బీజేపీలో చేరటానికి రంగం సిద్ధమైందట. రఘురాజుతో పాటు ఇతరపార్టీలకు చెందిన మరికొందరు నేతలు కూడా బీజేపీ కండువా కప్పుకునే అవకాశాలున్నట్లు కమలనాదులు చెబుతున్నారు. రఘురాజు చేరుతారంటే ఓకేనే కానీ ఇతర పార్టీల నేతలు అనేకమంది చేరుతారని చెప్పటంపైనే అనుమానాలున్నాయి. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్ధితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బీజేపీలో చేరటం వల్ల వచ్చే లాభంకూడా ఏమీలేదు.
ఇపుడున్న నేతల్లోనే చాలామంది పార్టీలోనే కంటిన్యు అవలేక అలాగని బయటకు వచ్చేయలేక నానా అవస్తలుపడుతున్నారు. ఇలాంటి నేపధ్యంలో కొత్తగా బీజేపీలో చేరే నేతలు ఎవరుంటారు అన్నదే ప్నశ్న. ఇక రఘురాజు చేరటం అంటే ఆ విషయంవేరు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ప్రాపకంలేకపోతే రెబల్ ఎంపీ పరిస్ధితి గోవిందానే. రఘురాజుకు రెండు అజెండాలున్నాయి. మొదటిది రాబోయే ఎన్నికల్లో మళ్ళీ ఎంపీగా గెలవటం. రెండోది ఏమిటంటే కేంద్రప్రభుత్వం గుడ్ లుక్సులో ఉండటం.
రెండింటిలో ఏది జరగకపోయినా రెబల్ ఎంపీ భవిష్యత్తు చాలా ఇబ్బందుల్లో పడిపోతుంది. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుంటుందని అనుకుంటున్నారు. ఆ పొత్తు వల్ల లాభపడాలని రఘురాజు శతవిధాల ప్రయత్నిస్తున్నారు. మూడుపార్టీల పొత్తుకు తనస్ధాయిలో రఘురాజు కూడా బాగా కష్టపడుతున్నారు. ఇపుడు సోమువీర్రాజుతో రఘురాజుకు ఏమంత సఖ్యతలేదు. అందుకనే బీజేపీ రాష్ట్రశాఖతో అంటీముట్టనట్లుగానే ఉంటున్నారు. అదే అధ్యక్షుడిగా సత్యకుమార్ బాధ్యతలు తీసుకుంటే పార్టీలోకి మారిపోయి రెబల్ ఎంపీ యాక్టివ్ అవుతారని చెబుతున్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.
ఇప్పటికిప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి అనే దానిపై ప్రముఖ జాతీయ మీడియా సంస్థ టైమ్స్ నౌ నవభారత్ నిర్వహించిన సర్వే యొక్క ఫలితాలు తదితర ముఖ్య అంశాలపై ఈరోజు "రచ్చబండ". pic.twitter.com/o0qSkXF8uX
— K Raghu Rama Krishna Raju (@RaghuRaju_MP) July 2, 2023