ట్రిపుల్ R చిత్రం నిన్నటి వేళ విడుదలయింది. వాస్తవానికి జనవరి ఏడున రిలీజ్ కావాల్సి ఉన్నా కరోనా ఉద్ధృతి కారణంగా వాయిదా పడింది. తరువాత అనేక పరిణామాల నేపథ్యంలో సినిమా విడుదల తేదీ మార్పు చెందుతూ వచ్చింది. అయినా కూడా ఎస్ఎస్ రాజమౌళి (దర్శకుడు) ఎక్కడా తొణక లేదు. బెణక లేదు.
అదే విధంగా హీరోలు తారక్ మరియు చరణ్ కూడా ఈ సినిమా పై ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. భారం నీదే కదా ! అనే విధంగా రాజమౌళి పైనే భారం వేశారు. బాధ్యత కూడా ఆయనే మోశారు. సినిమా విడుదల ఆలస్యం కావడంతో నిర్మాత ఎంతో ఆందోళన చెందారు. ఓ సందర్భంలో ఆస్పత్రి పాలయ్యారు కూడా !
అప్పుడు రాజమౌళి సీన్ లోకి వచ్చి ఫైనాన్షియర్లకు తానే భరోసా ఉన్నారు. రెండు వందల కోట్లకు ఆయనే భరోసా ఇచ్చారు. సంబంధిత పత్రాలపై సంతకాలు పెట్టి పంపారు. ఆ రోజు నిర్మాత దానయ్య కు గుండె సంబంధ శస్త్ర చికిత్స జరిగిందని కూడా వార్తలు వచ్చాయి. ఆ నేపథ్యంలో నిర్మాతకు దర్శకుడు రాజమౌళి ఎంతో ధైర్యం ఇచ్చారు. నమ్మకం పెంచారు. తనపై విశ్వాసం ఉంచాలని కోరారు. ఫలితంగా నిర్మాతకు అప్పుల కష్టాలు వడ్డీల కష్టాలు తగ్గాయి.
అయినా కూడా సినిమా విడుదల ఆలస్యం కావడంతో ఓ ఎనిమిది కోట్ల రూపాయల చొప్పున నెల నెలా వడ్డీ అయితే చెల్లించాల్సి వచ్చింది.ఆ విధంగా వడ్డీల రూపంలోనే ఇరవై నాలుగు కోట్ల రూపాయలు చెల్లించారని సమాచారం. ఇంకా మిగతాపనులు ఆలస్యం కావడం..కోవిడ్ కారణంగా ముందు చేసిన ప్రి రీలీజ్ ఫంక్షన్ల ఖర్చు అంతా వృథా కావడంతో నిర్మాత నేరుగా యాభై కోట్ల రూపాయలు కోల్పోయారు అని సమాచారం.
సినిమా ఇప్పుడు మంచి వసూళ్లు తెచ్చుకున్నా అందులో యాభై కోట్లు మినహాయించాలి. వీటితో పాటు రాజమౌళికి కూడా లాభాల్లో వాటా ఇవ్వాలి. ఇది కూడా ఒప్పందమే ! ఏ విధంగా చూసుకున్నా కొంత మొత్తం నష్టం నిర్మాతదే ! ఇక లాభాల్లో వైసీపీ వాటాలు ఎలా ఉన్నాయో చూద్దాం. సినిమా థియేటర్లలో చాలా శాతం ఇవాళ వైసీపీ నాయకుల చేతిలోనే ఉన్నాయి.