వైసీపీ మాజీ మంత్రి ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇదే చర్చ పశ్చిమ గోదావరిలో జోరుగా వినిపిస్తోంది. ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు (CHERUKUVADA SRIRANGANADHA RAJU) వ్యవహారం ఇప్పుడు ఆసక్తిగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీ తరఫున ఆచంట నుంచి విజయం సాధించిన శ్రీరంగనాథరాజు అనూహ్యంగా జగన్ మంత్రివర్గంలో తొలి క్యాబినెట్లో అవకాశం దక్కించుకున్నారు. అయితే రెండో దఫా పదవిని కోల్పోయారు. అయితే రెండున్నర సంవత్సరాల పాటు మంత్రిగా ఉన్న శ్రీ రంగనాథరాజు జిల్లా వ్యాప్తంగా దూకుడు పెంచారు. ఆచంట సహా చుట్టుపక్కల ఉన్న నాలుగు ఐదు నియోజకవర్గాలపై ఆయన పట్టు సాధించారు.
గత ఎన్నికల్లో ఆయన సాధించినటువంటి విజయానికి జగన్ ముగ్గులై మంత్రి పదవిని కట్టబెట్టారు. ఆ మంత్రి పదవిలో ఉండగానే చుట్టుపక్కల ఉన్నటువంటి నాలుగు ఐదు నియోజకవర్గాల్లోనూ తన హవా సాధించారు. ఇద్దరు ముగ్గురు నేతలను పార్టీలోకి చేర్పించాలని కూడా ఆయన ప్రయత్నించినట్టు సమాచారం. టిడిపి నుంచి గెలిచినటువంటి మంతెన రామరాజు వంటి వారితో ఆయన నిత్యం టచ్లో ఉండేవారు. అయితే ఆయన వస్తానని చెప్పారని కానీ రాలేదని ఒక వర్గం ప్రచారం చేసింది. ఇదిలా ఉంటే మంత్రి పదవి కోల్పోయిన తరువాత శ్రీరంగనాథరాజు పత్తా లేకుండా పోయారు.
అనారోగ్య కారణాలు అని చెబుతూ ఇంటికి ఆయన పరిమితమైనట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ వచ్చే ఎన్నికల్లో ఆయనకి టికెట్ ఇవ్వరనే ప్రచారం జోరుగా సాగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను కూడా పోటీకి ఉండనని తన కుమారుడికి అవకాశం ఇవ్వాలని జగన్ ను కోరినట్టు శ్రీ రంగనాథరాజు వర్గం ప్రచారం చేస్తుంది. ముఖ్యంగా శ్రీ రంగనాథకి అనుచరులుగా ఉన్నటువంటి వారు ఇప్పుడు కనిపించడం లేదు. నిజానికి గడపగడపకు మన ప్రభుత్వం, అదేవిధంగా స్టిక్కర్లు నువ్వే మాకు నమ్మకం జగనన్న వంటి కార్యక్రమాలతో దూకుడుగా ఉండాలని ఒకవైపు అధిష్టానం చెబుతున్నప్పటికీ మరోవైపు శ్రీ రంగనాథరాజు ఎక్కడ కనిపించకపోవడం ఆయన అనుచరులు కూడా కనిపించకపోవడం వంటివి ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ప్రస్తుతం ఆచంటలో టీడీపీ నేత, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ దూకుడుగా ఉన్నారు. టిడిపి నుంచి 2014 ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ పట్టు సాధించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఎన్నికలనాటికి ఆయన దూకుడు పెంచి గెలుపు గుర్రం ఎక్కాలని ఆలోచిస్తున్నారు. గెలిచి తీరుతానని ఆయన పార్టీ వర్గాలతో చెబుతున్నారు తరచుగా చంద్రబాబుతోను ఆయన భేటీ అవుతున్నట్టు తెలుస్తోంది. తరచుగా మీడియాతో ఉండటం టిడిపి తరఫున వాయిసు వినిపించడం ప్రజలను కలుసుకోవడం వైసీపీ విధానాలను ఎండగట్టడం వంటి అంశాల్లో పితాని దూకుడుగా ఉన్నారు.
ఇదే సమయంలో శ్రీ రంగనాథరాజు కానీ ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసిపి నాయకులు గాని సైలెంట్ గా ఉండడం ప్రజలను కలవకపోవడం వైసీపీలో చర్చనీయాంశంగా ఉంది. పోనీ ఇక్కడి నుంచి పోటీ చేస్తారని చెబుతున్న శ్రీ రంగనాథరాజు కుమారుడు కానీ ఆయన అల్లుడు కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఈ పరిస్థితులను చూస్తే టిడిపి వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు. స్వల్ప మెజారిటీతో అయినా ఈసారి టిడిపి కచ్చితంగా ఆచంట సీట్లు కొట్టేయడం ఖాయమని తమ్ముళ్లుఅంటున్నారు.
ఇక చంద్రబాబు కూడా వచ్చే ఎన్నికల్లో ఆచంట సహా పశ్చిమగోదావరి మొత్తం క్లీన్ స్వీట్ చేయాలి అనే ఉద్దేశంతో గట్టి పట్టుదలతో పని చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఆయన పశ్చిమ నేతలతో పదేపదే చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లా మొత్తం క్లీన్ షిప్ చేయాలని 2014లో సాధించినటువంటి విజయాన్ని తిరిగి పొందాలని చెబుతున్నారు. 2014 ఎన్నికలను చూసుకుంటే ఒక తాడేపల్లిగూడెం మినహా మిగిలిన అన్నిచోట్ల టిడిపి గెలిచింది. దీంతో ఆచంట నియోజకవర్గంలో మాజీ మంత్రి పితాని చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కలుసుకుంటున్నారు. సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. దీంతో పితానిని ఎక్కువ మంది విశ్వసిస్తున్నారు.
గతంలో కన్నా ఇప్పుడు ఆయన ర్యాంకు పెరిగిందని గ్రాఫ్ పెరిగిందని టిడిపి నాయకుల మధ్య చర్చ జరుగుతూ ఉండటం గమనార్హం. దీనిని బట్టి వచ్చే ఎన్నికల్లో ఆచంట నియోజకవర్గంలో టిడిపి గెలుపు సునాయాసం అవుతుందని నల్లేరుపై నడకగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ గెలుపు గుర్రం ఎక్కుతారని భావిస్తున్నారు మరి ఏం జరుగుతుందో చూడాలి.