రంకు, బొంకు దాగదు…. ఇది ఒక తెలుగు సామెత.
ఇపుడు ఎందుకు గుర్తుకువచ్చింది అంటే…
వైసీపీ నేతలు అబద్ధాలు చెప్పి జనాల్ని మేనేజ్ చేయొచ్చు అనుకుంటారు.
వారికి రెండు పథకాలు పడేస్తే మేము ఏం చెప్పినా నమ్ముతారు అనుకుంటారు
అందుకే నోటికి వచ్చింది చెప్పేస్తుంటారు.
తాజాగా వైసీపీ నేతల మధ్య కోఆర్డినేషన్ లోపంతో నిజం బట్టబయలైంది
కేంద్రాన్ని కలిసి ఏం మాట్లాడతారు అనే విషయం ఒకటైతే బయటకు వచ్చి మీడియాకు చెప్పేది మరోటి.
ఇదేమీ మేము గెస్ చేయడం లేదు.
వారి బండారాన్ని వారే బయటపెట్టుకున్నారు.
విజయసాయిరెడ్డి ఇతర ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిసి రాష్ట్రం కోసం కలిశాం అని చెప్పిన విషయం తెలిసిందే.
అయితే అది నిజం కాదు, రఘురామరాజు పై చర్యలు తీసుకుని మమ్మల్ని ఆయన టార్చర్ నుంచి కాపాడండి అని వేడుకోవడానికి వెళ్లిన విషయం వైసీపీ సోషల్ మీడియా హెడ్ గుర్రం దేవేందర్ రెడ్డి బయటపెట్టేశాడు
ఇపుడు అర్థం అయిందిగా వారు అబద్ధాలు చెప్పడంలో ఎంత ఆరితేరిపోయారో