అతిగా అనిపించే కోరిక ఇది.కానీ కోరుకోవడంలో తప్పేం లేదు.బట్టలూడదీసి కొడతా అని చెప్పడమే తప్పు. అలాంటి అరుపులు విని కూడా వైసీపీ అధినాయకత్వం స్పందిచకపోవడం ఇంకా తప్పు.బూతులతో నిండిన భాష ఎవ్వరు మాట్లాడినా తప్పే!
ఒకవేళ అది స్థానిక భాష అయినా కూడా మాట్లాడడంలో నిగ్రహం ఉండాలి. మాట్లాడేక ఆ మాటలు నలుగురి స్మరణకు తూగాలి. కానీ ఇవాళ కొడాలి నాని భాష చూడండి ఎంత బాగుంటుందో! ఆహా! అలాంటి భాష బెజవాడ స్థానిక భాష అయితే కాదు. కృష్ణా జిల్లాలో ఎవ్వరూ ఆ రౌడీ భాష మాట్లాడరు. మరి! ఎవరు మాట్లాడతారు అంటే ఒక్క నాని తప్ప ఇంకెవ్వరూ మాట్లాడరు. మాట్లాడలేరు కూడా!
శ్రీకాకుళం జిల్లా నాయకుల్లో ఎక్కువగా సీదిరి అప్పల్రాజు భాష ఇప్పుడు వివాదాలకు తావిస్తోంది. ఏంటండీ ఈ భాష అని వైసీపీ నాయకులను అడిగితే అది వారి విజ్ఞత విని వదిలేయడమే అని అంటారే తప్ప తప్పు దిద్దుకోమని ఎవ్వరూ ఎవ్వరికీ చెప్పరు.
ఇంతటి భాష బుద్ధావెంకన్న, బోండా ఉమ కూడా మాట్లాడగలరు. అందుకనే నానిని చూసి స్ఫూర్తి పొంది మాట్లాడుతున్నారు. ఈ గుడ్డలూడ దీసి కొట్టడం ఎక్కడిది… శ్రీకాకుళంలో ఎక్కడా ఇంతటి రౌడీ భాష స్థానిక భాషలో మిళితం అయి లేదు. అంటే వీళ్లకు వర్డ్ యూసేజ్ తెలియదా? తెలియకుండానే సేఫ్రాన్ టెర్రరిస్టుల్లా మాట్లాడుతున్నారా?
ఒకప్పుడు కాషాయ మూకలు ఒకప్పుడేంటి ఇప్పుడు కూడా బీజేపీ నాయకులు కొందరు (ఉత్తరాది కి చెందిన నేతలు) స్థానిక హిందీ భాషలో బూతులు ఎక్కువగా కలిపి ఉంటాయి కనుక అదే భాషను మీడియాలోనూ మాట్లాడేవారు. కొన్నిసార్లు వివాదాలు రేగిన సందర్భంలో వారు తగ్గిన రోజులుకూడా ఉన్నాయి. కానీ ఉత్తరాంధ్ర సంస్కృతిలో గుడ్డలూడ దీసి కొడతా అన్న మాట అయితే లేదు. మరి! మంత్రిగారికి తారక్ సినిమా రామయ్యా వస్తావయ్యా …లో పలికిన డైలాగ్ ఏమయినా స్ఫూర్తి కావాలి. కావొచ్చు కూడా !
కనుక మన నేతల నుంచి ఈ పాటి సంస్కారం ఈ పాటి భాష కోరుకోవడం అతి అవుతుంది. అతి చేస్తే గతి చెడుతుంది అని అంటారు కదా వైదికులు ఆ విధంగా మనం వీళ్ల భాష నుంచి మినహాయింపు కోరుకుని జీవితాలను నెట్టుకు రావాల్సిందే లేదా నెగ్గుకు రావాల్సిందే వీలున్నంత మేర! ఎందుకంటే మన నాయకులు సంస్కారవంతమైన xxx సబ్బు వాడకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నం అయిందేమో.