ఏపీ అధికార పార్టీ వైసీపీని అభద్రత వెంటాడుతోందా? ఎన్ని పథకాలు.. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమ లు చేసినా.. ఎక్కడో తేడా కొడుతోందనే భావన కనిపిస్తోందా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. ఔననే అంటున్నాయి. నిజానికి ఏపీలో వైసీపీ పాలన ప్రారంభమై.. రెండున్నరేళ్లు గడుస్తోంది.
ఈ రెండున్నరేళ్ల కాలంలో దేశంలో ఏ ప్రభుత్వమూ ప్రవేశ పెట్టని అనేక పథకాలను ప్రవేశ పెట్టామని.. సంక్షేమానికి వేలా ది కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్కరూ చెబుతున్నారు. ఇక, ఇప్పటి వరకు జరిగిన స్థానిక, పంచాయితీ, పరిషత్ ఎన్నికలను గమనిస్తే.. వైసీపీదే ఘన విజయం అన్న విషయం కూడా తెలిసిందే.
మరి.. ఒకవైపు.. తాము సంక్షేమ అమలు చేస్తున్నామని.. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని.. ప్రజలకు మెరుగైన పాలన అందిస్తున్నామని చెబుతున్న వైసీపీ నాయకులు.. మరోవైపు.. ఇన్ని ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ.. అభద్రతకు గురవుతుండడం ఆశ్చర్యం కలిగిస్తోందని అంటున్నారు పరిశీలకులు.
దీనికి కారణం.. ప్రజల్లో వైసీపీపై ఎలాంటి అభిప్రాయం ఉంది..? ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే.. ఫలితం ఎలా వస్తుంది? అనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నిర్వహిస్తుండడమే అని అంటున్నారు పరిశీలకు లు.
ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అంతర్గత సర్వే చేయిస్తోంది. ప్రభుత్వ పథకాలపై ప్రజల నుంచి అభిప్రా యాలు తెలుసుకుంటోంది. అంతేకాదు.. సీఎం జగన్‌పైనా పనిలో పనిగా అభిప్రాయ సేకరణ జరుగుతోం ది. మరి ఇప్పటి వరకు వచ్చిన ఎన్నికల ఫలితాలను బట్టి.. ఆల్ ఈజ్ వెల్! అని అనుకుంటే.. ఇప్పుడు సర్వేలు ఎందుకు?
ఒకవేళ సర్వేలే నిజమని భావిస్తే.. ఎన్నికల్లో వచ్చిన ఫలితం.. నిజం కాదని భావిస్తు న్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వానికైనా.. స్థానిక ఎన్నికల్లో విజయం లభిస్తే.. దానిని ప్రజాతీర్పుగానే పరిగణిస్తారు.
కానీ.. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇలా సరికొత్త సర్వేలు నిర్వహించడం వెనుక.. ఆ ఎన్నికలను నమ్మడం లేదా? అనే ప్రశ్న వస్తోంది. అదేసమయంలో తాము అమలు చేస్తున్న సంక్షేమం పూర్తిస్థాయిలో తమకు మళ్లీ విజయం అందిస్తుందనే భరోసా కూడా వ్యక్తం చేయలేకపోతున్న విషయాన్ని ఈ సర్వే స్పష్టం చేస్తోందని అంటున్నారు.
పైగా.. జగన్‌పై అభిప్రాయం కోరడం అంటే.. విపక్షాలు చెబుతున్నట్టు.. జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం పోయిందా? ఆయన ఏదో చేస్తారని.. ఎన్నో ఊహించుకుని అధికారం కట్టబెడితే.. ఇప్పుడు ఇలా చేస్తున్నారనే భావన ప్రజల్లో ఉందా? అందుకే వైసీపీ సర్వే బాట పట్టిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా.. వైసీపీలో అభద్రతా భావం కనిపిస్తోందని మేధావి వర్గాలు కూడా అంటున్నాయి.