ఉమ్మడి కృష్నాజిల్లాలోని పెడన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలను పోలీ సులు గుర్తించారు. దీంతో దాడి చేసి వాటిని పోలీసులు సీజ్ చేశారు. పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి నిల్వలు ఉన్నాయని పోలీసులకు సమాచా రం రావడంతో పెడన అధికారులు ఆ ఇంటిపై దాడి చేసి.. వాటిని స్వాధీనం చేసుకున్నారు.
57 బ్యాగులు, 5 అట్ట పెట్టెల్లో ఉన్న సామాగ్రిని సీజ్ చేసిన పోలీసులు.. వాటిని ఎన్నికల సంఘం అధికా రులకు అప్పగించారు. మచిలీపట్నం రూరల్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కె.నాగేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పెడన సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందితో సోదాలు నిర్వహించారు. ఎన్నికల మెటీరియల్ కు సంబం ధించిన జెండాలు, టోపీలు,మెడలో కండవాలు తదితర సామాగ్రి ఉన్నట్టు గుర్తించారు. సుమారు వాటి ఖరీదు రూ 4 లక్షల 29 వేల 300 విలువ చేసే ఎన్నికలు మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు.
పెడన నియోజకవర్గం నుంచి ఈ సారి వైసీపీ ప్రయోగం చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ ఉన్న మంత్రి జోగి రమేష్‌ను.. పొరుగున ఉన్నపెనమలూరుకు పంపించిన వైసీపీ.. పెడన నియోజకవర్గం నుంచి ఉప్పా ల రమేష్‌కు అవకాశం కల్పించింది. ఇక, టీడీపీ నుంచి సీనియర్ నేత, కాగిత కుటుంబానికి చెందిన కాగిత కృష్ణప్రసాద్ కు అవకాశం కల్పించారు. అయితే.. ఇప్పటి వరకు చేసిన జోగి రమేష్ కారణంగా నియోజకవర్గంలో వైసీపీకి పరువు పోయింది. దీంతో ఇక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.
అయితే.. ఏదో ఓ రకంగా ప్రజలను మచ్చిక చేసుకునేందుకు వైసీపీ నేత ఉప్పాల ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఎన్నికల తాయిలాలు… రెడీ చేసుకోవడం సంచలనంగా మారింది. మరోవైపు.. వైసీపీలోనే ఉన్న వ్యతిరేక వర్గం.. వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు.. పోలీసులకు సమాచారం చేరవేస్తుండడం మరింతగా పార్టీని ఇబ్బందులు పెడుతోంది. మొత్తానికి పెడనలో ఈ సారి వైసీపీకి కష్టం అంతా ఇంతాకాదని అంటున్నారు పరిశీలకులు.
*బిగ్ బ్రేకింగ్..*
కృష్ణాజిల్లా,పెడన
పెడనలో పెద్ద ఎత్తున వైసీపీ ప్రచార సామాగ్రి నిల్వలు
దాడి చేసి సీజ్ చేసిన పోలీసులు
పెడన గ్రంథాలయం సమీపంలోని మల్లి అనే వైసీపీ సానుభూతిపరుడి ఇంట్లో ప్రచార సామాగ్రి నిల్వలు
విశ్వసనీయ సమాచారంతో దాడి చేసిన పెడన పోలీసులు
57 బ్యాగులు, 5 అట్ట… pic.twitter.com/YKHzD7Nyb8
— ???? ???????????????????????? ???? (@dmuppavarapu) April 5, 2024