ఉత్తరకొరియా నియంత కిమ్ జోన్ ఉంగ్ని సీఎం జగన్ మించిపోయారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. వైసీపీ ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతోనే కేశవ్‌కు భద్రత తొలగించారని మండిపడ్డారు.
ఈ కక్ష సాధింపులతో.. వైసీపీ సర్కారు ఫోన్ ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టే అని విమర్శించారు. తక్షణమే కేశవ్‌కు గన్మెన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు.
సీఎం జగన్.. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ని మించిపోయారని లోకేష్ అన్నారు. దీనికి రుజువు వైసీపీకి జీవితకాల అధ్యక్షుడిగా తనకి తానే ప్రకటించుకోవడమేనని అన్నారు. జగన్.. రాష్ట్రానికి కూడా జీవితకాల ముఖ్యమంత్రిని అనుకుంటున్నా రేమో అని ఎద్దేవా చేశారు.
వైసీపీ డేటా చోరీ, ఫోన్ ట్యాపింగ్ గుట్టురట్టు చేశారనే అక్కసుతో.. పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ తొలగించేశారని మండిపడ్డారు.
ఇప్పటికే జగన్‌రెడ్డి ఆర్థిక ఉగ్రవాదాన్ని గణాంకాలతో సహా వెల్లడించిన కేశవ్.. తనకు అదనపు భద్రత కావాలని ప్రభుత్వాన్ని కోరితే ఉన్న సెక్యూరిటీ తొలగించేశారని దుయ్యబట్టారు. ఈ కక్ష సాధింపులతో వైకాపా సర్కారు వేలకోట్ల మాయం, ఫోన్ల ట్యాపింగ్ నిజమేనని ఒప్పుకున్నట్టే అని విమర్శించారు.
తక్షణమే కేశవ్ కు అదనపు గన్మెన్లను కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అభద్రతా భావంలో కూరుకుపోయిందని, అందుకే జగన్ జీవిత కాల అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారని.. కొత్త రాజ్యాంగం రాసుకున్నారని విమర్శించారు.