హైదరాబాదులో జగన్ ఆస్తులు, ఏపీలో రాజకీయ ప్రయోజనాలు, షర్మిలపై పగ … అన్నిటినీ తీర్చుకునే ప్రయత్నమే కేసీఆర్ తో కలిసి జగన్ ఆడుతున్న నాటకం అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
తెలంగాణలో పరిస్థితులు దిగజారడం, పాలనపై పట్టుకోల్పోవడంతో మళ్లీ సెంటిమెంట్ ను వాడుకునేందుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్… నిజంగానే జగన్ ను తిడుతున్నట్టు నటిస్తున్నారు.
ఈ తిట్లు చూస్తే నిజంగా జగన్ ప్రాజెక్టులు కట్టేస్తున్నాడేమో అన్న భ్రమ ఏపీకి రావాలన్నది మరో ప్రయత్నం.
రేవంత్ ఎంట్రీతో తెలంగాణ రాజకీయాలు కొత్త మలుపు తిరగనున్నాయి. సెంటిమెంట్ ను, కేసీఆర్ అబద్ధాలను సమర్థంగా ఎదుర్కోవడంలో రేవంత్ కచ్చితంగా కేసీఆర్ పై పై చేయి సాధిస్తారని అంటున్నారు.
ఇక రేవంత్ పీసీసీ చీఫ్ అవడంతో ఎక్కడికి వెళ్లాలో తెలియక అయోమయంలో ఉన్న టీఆర్ఎస్ నేతలకు మంచి వేదిక దొరికింది.