జగన్ తెలిసినంత కులరాజకీయం దేశంలో ఇక మరెవరికీ తెలియదు.
ఎవరి ఊహకు అందనంత లోతుగా జగన్ వ్యూహ రచన ఉంటుంది.
నటనలో ఆస్కార్ మించి ఆయన చేసే ఫర్ ఫామెన్స్ జనం గతంలో వంద శాతం నమ్మేవారు.
కానీ ఇపుడు జగన్ నాటకాలను కొందరు కనిపెట్టేస్తున్నారు. అలా కనిపెట్టిన ఒక నెటిజన్ జగన్ డ్రామా గురించి చాలా చక్కగా చెప్పారు. ఆయన పోస్టు యతాతథంగా !
అసెంబ్లీ లో జగన్ గారు అనగా రాజశేఖరరెడ్డి గారి కుమారుడు గారు అనగా మన సీఎం గారు చంద్రబాబు ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన యవ్వారం మొత్తం ఓ అరగంట చెప్పుకుంటూ వచ్చారు.
“ఆంధ్రాలో అన్నింటికీ మా బాబు( వైఎస్) పేరే ఉండాలి గనుకే పేర్లు మార్చుతున్నాం. అందరూ మూసుకుని ఉండండి” అని ఓపెన్ గా ఒప్పుకుని చావొచ్చుగా..
ఆ పేర్ల మార్పిడి కి మోరల్ సపోర్ట్ కోసం ఈ వెన్నుపోటు ప్రస్తావన దేనికి? అంటే NTR ని వాళ్ళు అవమానించగా లేనిది మేమెందుకు అవమానించకూడదనా?
అసలు అదంతా అసెంబ్లీ లో ఉన్న సభ్యులకు తెలియదా? సభా అధ్యక్షుడు కి తెలియదా? (నిజానికి ఆ వెన్నుపోటు సందర్భంలో మన ఈ “అధ్యక్షా”కూడా తెలుగుదేశమే)..పోనీ జనాలకి తెలియదా అదంతా??
సోషల్ మీడియాలో YSRCP పార్టీ వాళ్ళు కూడా అప్పటి కార్టూన్లను పోస్ట్ పెడుతున్నారు..
అసలు ఆ వెన్నుపోటు సంఘటన జరిగిన తర్వాతే కదా ఈ ప్రజలు ఓట్లు వేసి రెండు సార్లు చంద్రబాబు ని సీఎం చేసింది. అంటే అప్పటి సందర్భాన్ని బట్టి దాన్ని వాళ్ళు సీరియస్ గా ఏమీ పట్టించుకోలేదనేగా దానర్థం.
లేదా ప్రజలు ఆ మాత్రం తెలివిలేని మూర్ఖులా?
సరే, మూర్ఖులే అనుకుందాం..
మరి మిమ్మల్ని గెలిపించింది కూడా ఇదే ప్రజలు కదా..
అంటే అప్పుడు వెన్నుపోటు విషయం తెలిసిన కూడా ఓట్లు వేసిన ఇదే మూర్ఖ ప్రజలు 2019 కల్లా తెలివిమంతులైపోయి, కాన్షియస్ గా ఆలోచించి మీకు ఓటేసారా ??
జగన్ అసెంబ్లీ లో వైఎస్సార్ ని పదే పదే “నాన్నగారు నాన్నగారు” అంటూ ఉంటాడు. కనీసం మా నాన్నగారు అని కూడా అనడు. పైగా “వైఎస్సార్ కుమారుడు అనగా జగన్ ని అయిన నేను” అంటూ తనని తాను ప్రబోధించుకుంటాడు.
అలానే హిందూపురం కి ఫలానా పని చేసాను అని చెప్పే సందర్భంలో “హిందూపురం MLA బాలకృష్ణ” అనడానికి బదులుగా , “చంద్రబాబు గారి బావమరిది బాలకృష్ణ” అనే అంటాడు జగన్. అలా రాజ్యంగబద్ధ హోదా ని కాకుండా వ్యక్తిగత బంధాలను అసెంబ్లీలో రిఫర్ చేయడం నాకు అస్సలు నచ్చదు.
కానీ, వారు అలా “వ్యక్తిగత బంధాలను” పదే పదే గుర్తుచేయాల్సిన అవసరం ఏర్పడేలా చేసేది ఆంధ్రా ప్రజలే. ఎందుకంటే ఎవరు ఏ మంచి చేసిన ఆ వ్యక్తికి మాత్రమే కాకుండా ఆ కుటుంబాన్ని కూడా నెత్తిన పెట్టుకునే దుర్లక్షణం ఉంది ఆంధ్రుల్లో… అదే వారికి శాపం.