కోర్టులు, న్యాయమూర్తులను దూషించిన కేసులో మొదటి అరెస్టు కడపలోనే జరిగింది. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసును సీబీఐకి అప్పగిస్తు ఏడాది క్రితం కోర్టు ఆదేశించింది.
దాంతో కోర్టు నిర్ణయంపై మండిపోయిన వైసీపీ నేతలు, సామాజిక మాధ్యమాల్లో పార్టీ మద్దతుదారులు జడ్జీలపై అభ్యంతరకరంగా పోస్టులు పెట్టారు. ఆ పోస్టులకు సంబంధించి విచారిస్తున్న సీబీఐ… లింగారెడ్డి రాజశేఖరరెడ్డిని కడపలో అరెస్టు చేసింది.
తమ విచారణలో భాగంగా ఇఫ్పటికే బాపట్ల ఎంపి నందిగం సురేష్, ఎంఎల్ఏ గుడివాడ అమరనాద్, మాజీ ఎంఎల్ఏ ఆమంచి కృష్ణమోహన్ లాంటి వాళ్ళని విచారించింది. అయితే పోస్టులు పెట్టిన వారందరిని విచారించటం సీబీఐకి కష్టంగా మారింది.
ఎందుకంటే పోస్టులు పెట్టిన వాళ్ళల్లో చాలామంది విదేశాల్లో ఉంటున్నారు. వాళ్ళందరిని విచారణ పేరుతో భారత్ కు రప్పించటం కష్టమని స్వయంగా సీబీఐ అధికారులే కోర్టుకు చెప్పారు.
ఇపుడు అరెస్టయిన లింగారెడ్డి కూడా కువైట్ లోనే ఉంటాడు. అక్కడి నుండి కడపకు వచ్చిన విషయం తెలుసుకున్న సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. లింగారెడ్డి అరెస్టు విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణుల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ సానుభూతిపరులు, మద్దతుదారుల్లో ఇంకా ఎంతమందిని సీబీఐ అరెస్టు చేస్తుందో చూడాల్సిందే.
న్యాయమూర్తుల ను దూషించిన @YSRCParty కార్యకర్త లింగారెడ్డి . రాజశేఖర్ రెడ్డి ని అరెస్ట్ చేసిన సీబీఐ .
అత్యుత్సాహంతో , శాడిజం తో , 5 /- రూపాయలు కోసం జీవితాలు నాశనం చేసుకుంటున్న #Paytm కార్మికులు .. pic.twitter.com/FQWqo4JNe8— Poornakovuri (@KovuriPoorna) July 11, 2021
https://twitter.com/JayapalReddyTDP/status/1413836941297000453
నెక్స్ట్ సీబీఐ అరెస్టు చేయబోయే హిట్ లిస్ట్ ఇదే!!!
ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమిటో…. pic.twitter.com/p2zBevkWo3— Rambabu pasumarthi (@pasumarthi66) July 10, 2021