ప్రకాశం జిల్లా ఒంగోలు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి టార్గెట్గా కొ న్ని రోజులుగా సాగుతున్న వివాదాలు.. తారస్థాయికి చేరాయి. సొంత పార్టీలోనే సభ్యుడిగా ఉన్న.. ముఖ్యం గా బాలినేనికి అనుచరుడిగా ఉన్న వెంకట సుబ్బయ్య గుప్తా.. చేసిన వ్యాఖ్యలు.. కలకలం రేపాయి.
మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి, వంశీల వల్ల పార్టీ 20 శాతం ఓటు బ్యాంకు నష్టపోతోందని.. గుప్తా.. ఇటీ వల వ్యాఖ్యానించాడు. అంతేకాదు.. బాలినేని.. కూడా కేవలం భజన చేసే వారికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తు న్నారని అన్నాడు.
దీంతో అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ప్రకాశం రాజకీయం.. ఒక్కసారిగా రాజుకుంది. సొంత పార్టీలోనే ఉన్నట్టుండి ఇంత పెద్ద కుదుపు రావడంతో.. వైసీపీలో అసలు ఏం జరుగుతోందనే వాదన బలంగా వినిపి స్తుండడం గమనార్హం. ఇదిలావుంటే, మరోవైపు..గుప్తాను బాలినేని అనుచరులు దూషించడం.. చేయి చేసుకోవడం.. మరింత కాక రేపింది. ఇక, ఈ పరిణామాలతో టార్గెట్ బాలినేని.. అనే కామెంట్లు అధికార పార్టీ నుంచి వినిపిస్తుండడం గమనార్హం.
మరోవైపు.. బాలినేనిని టార్గెట్ చేయడం వెనుక.. టీడీపీకి చెందిన కీలక నాయకుడు.. ఉన్నాడని.. బాలినేని వర్గం ఆరోపిస్తోంది. వాస్తవానికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ నేతల్లో ఆగ్రహం కనిపిస్తోంది. ఒక్క ప్రకాశం జిల్లాలో జరిగిన ఘటన తెరమీదికి వచ్చి ఉండొచ్చు. కానీ, అంతర్గతంగా.. మాత్రం వైసీపీ నేతలు ఆగ్రహంతోనే ఉన్నారు. తమ కు కనీసం గుర్తింపు లభించడం లేదని, పార్టీకోసం తాము కష్టపడ్డామని.. అయినప్పటికీ.. తమను ఎవరూ పట్టించుకోవడం లేదని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
ఇటీవల.. గుంటూరుకు చెందిన మర్రి రాజశేఖర్ బావమరిది వెంకట సుబ్బయ్య కూడా.. ఇలానే బహిరంగ సభలో వ్యాఖ్యానించారు. ఇప్పుడు వెంకట సుబ్బయ్య గుప్తా. మరి దీనిని బట్టి.. వైసీపీ అధిష్టానం.. అసలు ఏం జరుగుతోందనే విషయంపై దృష్టిపెడితే మంచిదని అంటున్నారు పరిశీలకులు.