కాస్త మానవత్వం చూపండి మీ పుణ్యం ఉంటుంది అంతేకానీ నోటికి వచ్చిందంతా వాగకండి అని అంటోంది విపక్షం. కేవలం టీడీపీ సానుభూతిపరులు అన్న ఒకే ఒక్క కారణంతో పింఛను నిలిపేసిన వైనం ఉమ్మడి విజయనగరం జిల్లా, బొబ్బిలిలో చోటు చేసుకుంది. ఇంత జరిగినా పింఛను లేదన్న బాధతో కన్నీళ్లు పెడుతున్నా పట్టించుకోకుండా ఆ ఎమ్మెల్యే చేసిన దురుసు వ్యాఖ్యలు ఇప్పుడిక వివాదాలకు తావిస్తున్నాయి. అంటే తమకు ఓట్లు వేయకున్నా వేసినా పథకాలు అందరివీ అని చెప్పారే! ఆ మాట మరిపోయారా ?
వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ విభిన్నంగా స్పందిస్తారు. అంటే సానుకూల వైఖరితో కాకుండా అదో టైపు ఆన్సర్లతో అన్న మాట. సమస్యలు చెప్పామే అనుకోండి నోటికి వచ్చిన విధంగా తిడతారు. అదే జగన్ ను పొగిడారే అనుకోండి ఇక చూడండి అస్సలు వీరి ఆనందాలకు అవధులన్నవి ఉండనే ఉండవు. ఇదీ ఇప్పుడు జరుగుతున్న నయా కథ. తాజాగా బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చినప్పలనాయుడు స్పందన చూస్తే ఆశ్చర్యపోతారు. కాదు కాదు ఆగ్రహంతో ఊగిపోతారు.
ఓ వికలాంగురాలి పింఛను రాలేదు అని బొబ్బలి మండలం, వాడాడలో వేడుకున్న కుటుంబానికి ఆయన ఇచ్చిన సమాధానం మామూలుగా లేదు. పింఛను రాలేదా ఆగిపోయిందా అయితే అది మీ ఖర్మ అని చెప్పి తప్పుకున్నారాయాన. గడగడపకూ మన ప్రభుత్వంలో భాగంగా ఇక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యేకు బాధిత కుటుంబం తన గోడు చెప్పుకుంది. ఇదంతా విని ఎమ్మెల్యే తనదైన నిర్లక్ష్యపు ధోరణిలో మాట్లాడడం ఇప్పుడిక అక్కడ చర్చనీయాంశం అవుతోంది.
మా పాపకు గతంలో పింఛను వచ్చేది. రెండేళ్ల క్రితం వరకూ నెలకు మూడు వేలు చొప్పున పింఛను వచ్చేది. కానీ ఇప్పుడు మేం టీడీపీ సానుభూతి పరులం అన్న నెపంతో ఆపేశారు. మాకు 5 విద్యుత్ మీటర్లు ఉన్నాయని చెబుతూ ఆపేశారు. కానీ మేం ఓ అద్దె ఇంట్లో ఉన్నాం అని చెప్పినా వినిపించుకోవడం లేదు సంబంధిత అధికారులు అని ఎమ్మెల్యే ఎదుట గోడు వెళ్లబోసుకుంటే
ఎమ్మెల్యే మానవత్వం అన్నది లేకుండా మాట్లాడుకుంటూ వెళ్లిపోయారు అని, ఇక తమకు న్యాయం ఎవరు చేస్తారని బాధిత వర్గం కన్నీళ్లు పెడుతోంది. ఆ రోజు కులం చూడం..మతం చూడం.. అర్హులయిన వారందరికీ పథకాలు ఇస్తాం.. పింఛన్లు ఇస్తాం..ఇళ్లు ఇస్తాం అని చెప్పిన వైసీపీ బాస్ జగన్ తన సొంత పార్టీ మనిషి చెప్పిన మాటలు వింటే ఏమౌతారో మరి!
ఇంతకంటే గొప్ప జవాబు..మన బొబ్బిలి MLA దగ్గర నుంచి కోరుకోకూడదు.
2024 లో వైసిపి తలరాతల్ని తారుమారు చెయ్యాలి ప్రజలు #ycpfailedgovernment #JaganFailedCM #Bobbili pic.twitter.com/FYGFuPy3Hk
— Babu Paluru (@BabuPaluruJSP) May 26, 2022