ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి. కొన్నింటిపై అస్సలు అవగాహన అన్నదే లేకుండా మంత్రులు ఉన్నారు. కొందరికి ఏ పథకం ఏంటో కూడా తెలియదు. కొన్ని అస్సలు అక్కర్లేదు అన్న ధోరణిలో కొందరు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఎవరు ఏమన్నా సరే ! పథకాలను అమలు చేసే తీరులో వెనక్కు తగ్గేదే లేదని అంటున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.
వైఎస్ జలకళ పథకం కింద ఉచిత బోర్ల తవ్వకం అనేది ఒకటుంది. అది వైసీపీ నేతలు సొంతానికి వాడుకోవడానికే పనికొస్తుంది. ఊరికి ఒకరికో ఇద్దరికో ఉచిత బోర్లు వేస్తే… మిగతా వారు పార్టీకి దూరమవుతారు అంటున్నారు వైసీపీ ఎమ్మెల్యేల.
గత ఏడాది ఆరంభించిన ఈ పథకానికి సంబంధించి కొన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
– వైఎస్సార్ జలకళ పథకం ద్వారా నాలుగేళ్లలో 2340 కోట్లు పెడతాం అన్నారు. ఖర్చు చేసింది ఎంత?
– రెండు లక్షల బోర్లు వేయాలని సంకల్పం… వేసింది ఎన్ని?
– ఐదు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుతుందన్నది ప్రభుత్వ అంచనా!
– సెప్టెంబర్ 28, 2020న జగన్ ఈ పథకాన్ని ప్రారంభించారు కానీ ఫలితం శూన్యం.
– ఉచితంగా బోర్ వేయించుకోవాలనుకునే రైతులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఇచ్చింది ప్రభుత్వం. కానీ వలంటీర్ ది కూడా చెల్లదు, వైసీపీ నేత చెప్పినోళ్లకే బోరు.
– ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బోర్ రిగ్ ఏర్పాటు. నియోజకవర్గంలో 30 వేల రైతు కుటుంబాలుంటాయి. ఒక బోరు ఎంత మందికి వేస్తుంది?
కొసమెరుపు ఏంటంటే… అసలు మూడేళ్లలో 5 శాతం మందికి కూడా ఈ పథకం ద్వారా లబ్ధి కలగలేదు.
అందుకే దీని వల్ల పార్టీకి నష్టమే తప్ప…. లాభం లేదంటున్నారాయన. అసలు ఈ పథకం శుద్ధ దండగ అంటున్నారు. జగన్ పెట్టి అతిపెద్ద దగా పథకం ఇదే అన్నట్టు ఆయన మనసులో మాట.