పులిచింతల ప్రాజెక్టులో క్రస్ట్ గేటు కొట్టుకుపోయిన ఘటన ఇరు తెలుగురాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. చంద్రబాబు వల్లే పులిచింతల ప్రాజెక్టు ఇలా నాసిరకం నిర్మాణంగా మిగిలిందని వైసీపీ నేతలంటున్నారు. అయితే, ఈ ప్రాజెక్టును తమ ప్రభుత్వం, గతంలోని వైఎస్ఆర్ ప్రభుత్వం కట్టించలేదని సాక్షి పత్రికతో పాటు వైసీపీ నేతలంతా ముక్తకంఠంతో చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ విమర్శల నేపథ్యంలోనే వైసీపీ నేతలకు టీడీపీ నేతలు గట్టి కౌంటర్ ఇచ్చారు.
తాము చాలాకాలం నుంచి చెబుతోంది ఇదేనని, వైఎస్ అనే మహానేత…ప్రాజెక్టుల పేరుతో మేత మేశాడు తప్ప ఏమీ చెయ్యలేదని, అందుకే పులిచింతల ఆయన హయాంలో కట్టిన అనేక ఫ్లై ఓవర్లు,అనేక ప్రాజెక్టులు నాసిరకం నిర్మాణాలుగా మారాయని ఆధారాలతో సహా విమర్శలు గుప్పిస్తున్నారు. పులిచింతల డిజైన్లను కాంట్రాక్టర్ మార్చాడని, గేట్లు తగ్గించాడని, దాని వల్లే ఈరోజు గేటు ఊడిపోయిందని వైసీపీ నేతలు చెబుతున్నారు. కానీ, ఇది పచ్చి అబద్ధం అనడానికి 2006 లో జరిగిన అసెంబ్లీ సమావేశాల రికార్డులే సాక్ష్యమని నిరూపిస్తున్నారు.
2006, ఫిబ్రవరి 25 అసెంబ్లీ రికార్డ్ నంబర్ 6301 ప్రకారం ఆరోజు అసెంబ్లీ వాయిదా పడిందని, పులిచింతలపై చర్చకు టీడీపీ సభ్యులు పట్టుబట్టడంతో సభ వాయిదా వేశారని చెబుతున్నారు. కాంట్రాక్టర్ డ్యామ్ డిజైన్స్ కాంక్రీట్ నుండి మట్టికి మార్చారని, గేట్లు తగ్గించారని నాటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు సభలో గొడవ చేస్తే సమాధానం చెప్పలేక సభను వాయిదా వేసి నాటి సీఎం వైఎస్సార్ వెకిలి నవ్వులు నవ్వారని ఆరోపిస్తున్నారు.
డిజైన్లు మారిస్తే ఏమీ కాదంటూ వైఎస్ చెప్పారని, కాంట్రాక్టర్ కి దాదాపు 50 కోట్లు మిగిలిందని ఆరోపిస్తున్నారు. ఇది తెలంగాణ వ్యతిరేక ప్రాజెక్ట్ అని కోమటిరెడ్డిని పంపించి పులిచింతలలో సామాన్లను వైఎస్ఆర్ పగలగొట్టించారని ఆరోపణలున్నాయి. ఆ తర్వాత మాజీ సీఎం రోశయ్య హయాంలో పనులు ప్రారంభం అయ్యాయి. ఆ తర్వాత మాజీ సీఎం కిరణ్ కుమార్ హయాంలో రెండు సార్లు కాపర్ డ్యామ్ కొట్టుకుపోయి చివరకి సగం గేట్లతో ప్రాజెక్టు ఓపెన్ చేశారు
అయితే, నాసిరకం నిర్మాణం అంటూ కిరణ్ ప్రభుత్వం కాంట్రాక్టర్ పై కోర్టులో కేసు వేసింది. కానీ, జలయజ్ఞం క్లాజుల వల్ల కాంట్రాక్టరే గెలిచాడు. దీంతో, 2014లో కాంట్రాక్టర్ కి 120 కోట్లు పరిహారం చెల్లించాలని కిరణ్ సర్కార్ ఉత్తర్వులిచ్చింది. ఈ నాసిరకం ప్రాజెక్టులో 8 టిఎంసిలకు మించి నీరు నిల్వ ఉంచకూడదని సీడబ్ల్యూసీ ఆర్డర్స్ ఇచ్చింది. ఆ తర్వాత 2014లో చంద్రబాబు ప్రభుత్వంపైనా కాంట్రాక్టర్ గెలిచారు. దీంతో, కోర్టులకి వెళ్లటం దండగని రూ.190 కోట్లు రిలీజ్ చేసి, భూసేకరణకు రూ.70 కోట్లిచ్చి ఆ కాంట్రాక్టర్ కు దండం పెట్టారు చంద్రబాబు.
ఆ తర్వాత వేరే కంపెనీతో పనులు చేయించి 2017 నాటికి 20 టిఎంసీల సామర్థ్యం తెచ్చిన ఘన చంద్రబాబుది. 2018 కల్లా ఫుల్ స్టోరేజ్ కి వచ్చేలా పనులు పూర్తి చేసింది చంద్రబాబు సర్కార్. అయితే, బేస్ డిజైన్ మారలేదు కాబట్టి…ఎన్నికోట్లు పెట్టినా పులిచింతల అతుకుల బొంతే. ఇలా, పులిచింతల తరహాలో వైఎస్ హయాంలో కాంక్రీట్ నుండి మట్టికి మార్చిన మరో రెండు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. క్రింద ఉన్న లింక్ లోని వీడియో చూస్తే ఆ ప్రాజెక్టుల దుస్థితి అర్థమవుతుంది.