మా కుటుంబంపై కొన్ని పత్రికలు వ్యాఖ్యలు చేస్తున్నాయి – డా.వైఎస్సార్ భార్యగా ప్రజలకు సమాధానం చెప్పేందుకు లేఖ – డా.వైఎస్సార్ మరణం తర్వాత మా కుటుంబమే లక్ష్యంగా వార్తలు రాస్తున్నారు – చంద్రబాబు బలాన్ని పెంచలేమని తెలిసినప్పుడల్లా వ్యతిరేక వార్తలు పచ్చ మీడియా అసత్యాలతో వార్తలు వండి వారుస్తోంది – పవన్ కల్యాణ్ కూడా పచ్చమీడియా దారిలోనే మమ్మల్ని టార్గెట్ చేశారు – పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీకి ఘన విజయం ఇచ్చారు – గెలవలేమని స్పష్టత వచ్చాక చంద్రబాబు పరిషత్ ఎన్నికలను బాయ్‌కాట్ చేస్తూ ప్రకటన చేశారు – మా కుటుంబమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి దిగజారిన రాతలు, వైఎస్ వివేకా హత్య ఎవరు చేశారన్నది కచ్చితంగా నిగ్గు తేలాల్సిందే –
ఇందులో మా కుటుంబ సభ్యులందరిదీ ఒకటే మాట – హత్య జరిగిన సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు – నాడు మంత్రిగా ఉన్న ఆదినారాయణరెడ్డిపై అనుమానాలున్నాయి – తిరుపతిలో ఆదినారాయణరెడ్డిని స్టేజీ మీద పెట్టుకుని పవన్ కళ్యాణ్ మా కుటుంబంపై విమర్శలు చేశారు – కేంద్రం పరిధిలోనే సీబీఐ ఉందని తెలిసి మరీ పవన్ కళ్యాణ్ విమర్శలు చేస్తున్నారు – వైఎస్ జగన్‌పై 2018లో హత్యాయత్నం జరిగినప్పుడు చంద్రబాబే సీఎం – రెండు కేసులనూ దర్యాప్తు చేస్తోంది కేంద్ర సంస్థలు సీబీఐ, ఎన్ఐఏనే – నిజాలను పక్కదారి పట్టించేలా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కథనాలు ఉన్నాయి – కుటుంబంలో ఒకరిపై ఒకరికి అనుమానం వచ్చేలా ఆర్కే తప్పుడు వార్తలు – బంధువర్గం రెండుగా చీలినందుకు నేను కుంగిపోయానని రాశారు – అందరిని గౌరవించే మనస్తత్వం సీఎం వైఎస్ జగన్‌ది – ఓదార్పు, పాదయాత్రల్లో జగన్ స్వభావం ఏంటో ప్రజలు గమనించారు –
రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో ఉందని షర్మిల గట్టిగా నమ్మింది.. నా బిడ్డల మధ్య విభేదాలు తీసుకురావడానికి దిగజారుడు ప్రయత్నాలు చేస్తున్నారు – వివేకా కేసులో హంతకులను గుర్తించి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే – ఈ విషయంలో సునీతకు మా కుటుంబ సభ్యుల అందరి మద్దతు ఉంది :
వైఎస్ విజయమ్మ
ప్రజల సందేహాలు-విజయమ్మ నుండి సమాధానం కోరుతున్నవి
1. మార్చి 2019లో వివేక కేసు ఎంక్వయిరీ చేస్తున్న ఇంటలిజెన్స్ డీజీ, కడప ఎస్పీని ఎందుకు కంప్లైంట్ లు పెట్టి ట్రాన్స్ఫర్ చేపించారు ?
2. అధికారంలోకి వచ్చిన తరువాత, దాదాపుగా ఏడాది పాటు, రాష్ట్ర ప్రభుత్వమే విచారణ చేసింది, ఒక్కరిని కూడా ఎందుకు పట్టుకోలేక పోయారు ?
3. సిబిఐ విచారణ అవసరం లేదని, జగన్ రెడ్డి ఎందుకు పిటీషన్ వెనక్కు తీసుకున్నాడు ?
4. వైఎస్ సునీత సిబిఐ విచారణ అడిగితే, సిబిఐ అవసరం లేదని, జగన్ ప్రభుత్వం ఎందుకు వాదించింది ?
5. వివేక కేసులో అనుమానితునిడిగా ఉన్న శ్రీనివాసరెడ్డి అసహజ మరణం చెందితే ఆత్మహత్యగా కేసు ఎందుకు నమోదు చేసారు ?
6. వివేక కేసు డైరీ ఇవ్వమంటే, ఎందుకు పులివెందుల కోర్టు, ఇప్పటి వరకు సిబిఐకి ఇవ్వలేదు ?
7. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ ఎందుకు నత్తనడక నడుస్తోందని, జగన్ కేంద్రాన్ని ఎందుకు అడగటం లేదు ?
8. వైఎస్ సునీత అడిగిన ఒక్క ప్రశ్నకు అయినా, విజయమ్మ లేఖలో జవాబు ఉందా ?