తల్లీకూతుళ్ళిద్దరిది ఓవర్ యాక్షన్ అనే అనుకుంటున్నారు. సోమవారం వైఎస్సార్టీపీ అధ్యక్షరాలు షర్మిల ఇంటి దగ్గర జరిగిన ఎపిసోడ్లు తర్వాత విజయమ్మ విషయంలో జరిగిందంతా జనాలు లైవ్ రిలేలో చూసిందే. టీఎస్పీఎస్పీ పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారం నేపధ్యంలో విచారిస్తున్న సిట్ అధికారులను కలవాలన్నది షర్మిల ప్రయత్నం. ఆ ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో తన ఇంటిదగ్గర షర్మిల పెద్ద సీనే క్రియేట్ చేశారు.
కూతురు సీన్ కు అదనంగా విజయమ్మ చేసింది కూడా ఓవర్ యాక్షన్ అన్నట్లుగానే అనిపిస్తోంది. షర్మిల వాదన ఏమిటంటే సిట్ అధికారులను కలిసి తన అభిప్రాయాలను చెప్పాలనట. అందుకనే సిట్ కార్యాలయంకు వెళుతుంటే తనను పోలీసులు అడ్డుకోవటం ఏమిటని అడిగారు. అయితే సిట్ ఉన్నతాధికారులను కలిసేందుకు షర్మిల ముందస్తుగా అనుమతి తీసుకున్నారా లేదా అన్నది తెలీదు. అనుమతి లేకుండా ఏ ఉన్నతాధికారిని ఎవరు కలవలేరన్నది అందరికీ తెలిసిన విషయమే.
ఉన్నతాధికారులను కలవటానికి ముందుగా అనుమతి తీసుకోలేదు కాబట్టే షర్మిలను తాము అడ్డుకున్నామని పోలీసులు అంటున్నారు. ఈ నేపధ్యంలోనే షర్మిలకు పోలీసులకు మధ్య చిన్నపాటి వాదన జరిగింది. ఈ సమయంలోనే లేడీ కానిస్టేబుల్ పై షర్మిల చెంపమీదకొట్టారు. అలాగే మరో అధికారిని భుజంపట్టుకుని నెట్టేశారు. ఇవన్నీ టీవీల్లో కనబడుతున్నవే. అందుకనే షర్మిలను అరెస్టుచేసి కోర్టులు ప్రవేశపెడితే 14 రోజుల రిమాండుకు పంపింది.
షర్మిల గొడవను చూసిన వెంటనే విజయమ్మ కూడా వచ్చేశారు. షర్మిల దగ్గరకు వెళ్ళకుండా విజయమ్మను కూడా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడ విజయమ్మ కూడా ఒక కానిస్టేబుల్ ను చెంపమీద కొట్టారు. నిజానికి షర్మిల, విజయమ్మలు చేసింది ఓవర్ యాక్షన్ అనే అనిపిస్తోంది. ఎందుకంటే వీళ్ళని అడ్డుకున్నది లేడీ కానిస్టేబుళ్ళే కానీ ఇంకెవరు కాదు. మరలాంటపుడు వాళ్ళని చెంపమీద కొట్టాల్సిన అవసరం తల్లీ, కూతుళ్ళకి లేదు. అనుమతి లేకుండానే సిట్ ఉన్నతాధికారులను కలిసినపుడు అక్కడేమైనా షర్మిల సీన్ క్రియేట్ చేస్తే బాధ్యత ఎవరిది ? అందుకని ముందుగానే షర్మిలను పోలీసులు అడ్డుకున్నది. అదే ఇపుడు ఇంత వివాదంగా మారింది.