“మొదటి నుంచి నేను కుటుంబ సభ్యులనే నమ్మాను. మాది చాలా కుటుంబం. అందుకే అందరినీ న మ్మాను. అందరూ నా వాళ్లే అనుకున్నా. కానీ, ఈ నమ్మకంపైనే వారు దెబ్బకొట్టారు. వారిని నమ్మి మోసపో యా..నేను ప్రతీకారమే కోరుకుని ఉంటే.. కడప వారి మాదిరిగానే నేను కూడా వెళ్లి నరికేదాన్ని“ అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె వైఎస్ సునీత వ్యాఖ్యానించారు. తాజాగా ఆమె.. హైదరాబాద్‌లో మీడియాతో మట్లాడారు. ఈ సందర్భంగా భారీ స్క్రీన్‌పై వైఎస్ వంశ వృక్షాన్ని, అదేవిధంగా వివేకానందరెడ్డి రాజకీయ జీవితాన్ని ఆమె వివరించారు.
“వివేకానందరెడ్డి రెడ్డిగారిని ప్రతిపక్షాలు హత్య చేశాయమని మావాళ్లు చెప్పారు. నేను కూడా నిజమేనని అనుకున్నా. కానీ, ఆ తర్వాత తెలిసింది. మా కుటుంబంలోని వాళ్లే మా నాన్నను దారుణంగా హత్య చేశారని.. అందరూ నాలాగే ఉంటారని ముందు అనుకున్నా.. కానీ.. తర్వాతే తెలిసింది.. వాళ్లు మోసం చేశారని. కుటుంబ సభ్యులను నమ్మి మోసపోయా“ అని సునీత వ్యాఖ్యానించారు. దీంతో తాను మానసికంగా చాలా రోజులు ఇబ్బంది పడ్డానని తెలిపారు.
అయితే.. ఈ కేసు తన వాళ్లే నిందితులుగా ఉన్నారని తెలిసి కూడా.. ఇన్నాళ్లూ ఏమీ చేయలేక పోయినం దుకు కూడా తాను ఆవేదన చెందుతున్నట్టు సునీత పేర్కొన్నారు. ప్రస్తుతం తాను చేస్తున్న పోరాటం .. ప్రతీకారం తీర్చుకునేందుకు కాదని.. నిందితులు, దోషలను ప్రజల మధ్య నిలబెట్టడమేనని సునీత పేర్కొన్నారు. ఈ పరిస్థితి ఇంకొకరికి రాకుండా.. న్యాయం జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. వ్యవస్థ సక్రమంగా పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు.
నేను కూడా నరికేదాన్ని!
“నేను ప్రతీకారమే కోరుకుని ఉంటే.. కడప వారి మాదిరిగానే నేను కూడా వెళ్లి నరికేదాన్ని. కానీ, నేను ప్రతీకారం తీర్చుకోవాలని లేదు. వివేకానందరెడ్డి కూడా.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనకు వెన్నుపోటు పొడిన వారిపై ప్రతీకారం తీర్చుకోలేదు.. వారికంటే మరింత మెరుగైన విధంగా తన సామర్థ్యాన్ని ప్రదర్శించి.. వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు ప్రయత్నించారు“ అని సునీత వ్యాఖ్యానించారు. నా లక్ష్యం కూడా ఇదే.. ఇలాంటి పరిస్థితిలో న్యాయం కోసమే నేను పోరాడుతున్నానని తెలిపారు. వ్యవస్థను సక్రమంగా పనిచేయించగలిగే చాలని సునీత పేర్కొన్నారు.
నాది ఒంటరి పోరు!
తన తండ్రి కోసంతాను ఒంటరిగానే పోరాటం చేస్తున్నానని సునీత చెప్పారు. తన వెనుక ఎవరో ఉన్నారని..ఏదో పార్టీ ఉందని కొందరు(వైసీపీ నేతలు) చేస్తున్న విమర్శలను తాను పట్టించుకోనన్నారు. తాను ఒంటరిగానే పోరాటం చేస్తున్నానని చెప్పారు. ఇది తన కుటుంబ పోరాటమని.. తన పోరాటమని వ్యాఖ్యానించారు. తన వెనుక ఎవరూ లేరని చెప్పారు.