వైఎస్ జగన్ రెడ్డి చంద్రబాబుపై విసిరిన బాణం రివర్సయ్యింది.
అన్నకే తగులుకునే పరిస్థితి వచ్చింది.
ఏంటి ఇదంతా నిజమేనే అని మీకు అనిపించిందా?
షర్మిల పార్టీ పెడుతుందని ముందే చెప్పిన రాధాకృష్ణే ఇది కూడా చెబుతున్నాడు.
మరి ఆరోజు రాధాకృష్ణ చెప్పినట్టే జరిగింది కదా, ఇపుడు కూడా అదే జరగనుందని చెప్పొచ్చు.
ఎందుకంటే ఆర్కేకి వస్తున్న సమాచారం అంతా నేరుగా షర్మిల నుంచే వస్తోంది.
అసలేం జరిగింది?క్రిస్మస్ సందర్భంగా ఇడుపులపాయలోని తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించడానికి మొత్తం కుటుంబం అక్కడికి చేరుకుంది.
వైఎస్ బతికున్నపుడు ఇద్దరికీ ఆస్తుల్లో సమాన వాటా అని వైఎస్ అన్నారట.
అనుకోని ప్రమాదం వల్ల పంచకుండానే ఆయన చనిపోయారు. ఇపుడు జగన్ ఆస్తంతా నాదే అని చెబుతున్నాడట.
తండ్రి ఆస్తిలో నాకు సమాన హక్కు ఉందని షర్మిల అడుగుతోంది. కుదరదని జగన్ అంటున్నారట.
దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. గెస్టు హౌస్ లో గొడవ ఎంత వరకు వెళ్లిందంటే… రాత్రికి రాత్రి షర్మిల గెస్టు హౌస్ వదిలేసి హైదరాబాద్ కు వచ్చేసేంతగా జరిగిందట.
షర్మిల ఆలోచనేంటి?
తనకు న్యాయంగా రావల్సిన ఆస్తిని ఇవ్వను అని చెప్పడంతో షర్మిల బాగా హర్టయ్యిందట. ఆర్థికంగా ఎక్కడో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు అధికారంకూడా తోడు కావటంతోనే ఇలా తెగిస్తున్నాడు. రాజకీయంగా సోదరుడ్ని బలహీనపరిస్తే తప్పించి.. ఆస్తుల్లో తన వాటా తనకు దక్కదని షర్మిల అభిప్రాయపడుతున్నట్లుగా ఆర్కే పేర్కొన్నారు.
పట్టుదల విషయంలో షర్మిల.. తన తండ్రి నోట్లో నుంచి ఊడిపడ్డ మనిషే. జగన్మోహన్రెడ్డి కూడా అంతే.
ఈ నేపథ్యంలో అన్నపై ఆంధ్రలోనే పార్టీ పెట్టి… జగన్ పై పంతం నెగ్గించుకోవాలని షర్మిల డిసైడందట.
సోదరుడితో గొడవ పడి హైదరాబాద్ చేరుకున్న షర్మిల.. శుక్రవారం రోజంతా ఒంటరిగా, ముభావంగా ఉండిపోయారని ఆర్కే రాశారు.
సొంత కుటుంబ సభ్యుడి హత్య కేసులో నిందితులను కాపాడేందుకు జగన్ రెడ్డి ప్రయత్నం చేయడం, బాబాయినే నిర్లక్ష్యం చేయడంతో మొదలైన గొడవలు ఇపుడు ఆస్తి దాకా వచ్చాయి.
తెలంగాణ పార్టీ సంగతేంటి?
తెలంగాణ రాజకీయాలలో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న షర్మిల ఆర్థికంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు.
రాజకీయ పార్టీ నిర్వహణకు డబ్బు అవసరం. ఈ పరిస్థితుల్లో కుటుంబపరంగా తనకు దక్కాల్సిన ఆస్తిని కూడా ఇచ్చేది లేదని సోదరుడు జగన్‌రెడ్డి తెగేసి చెప్పడంతో షర్మిలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది.
తల్లి విజయమ్మ మద్దతు తనకే ఉన్నప్పటికీ ఆమె ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నందున ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలా? అని షర్మిల మథన పడుతున్నారు.
ఈ క్రమంలో తనకు కావాల్సిన వారితో మంతనాలు జరుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో జగన్‌రెడ్డిని రాజకీయంగా అస్థిరపరిస్తే తప్ప అతను లొంగడని ఆమెకు సలహా అందినట్టు చెబుతున్నారు.
ఒకవేళ అన్నను దెబ్బకొట్టి తన వాటా ఆస్తి తీసుకోవానుకుంటే జగన్‌రెడ్డి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత నానాటికీ పెరుగుతున్నందున ఇదే అదనుగా ఆయనను రాజకీయంగా దెబ్బ కొట్టడం కరెక్టన్న ఆలోచన కూడా షర్మిల చేస్తున్నట్టు చెబుతున్నారు.
జగన్ కేసుల్లో జైలుకు పోతే భారతిని సీఎం కాకుండా అడ్డుకునే ప్రయత్నం కూడా జరగొచ్చు.
ఒకవేళ ఆంధ్రలో పార్టీ పెడితే ఆమె తెలంగాణ రాజకీయాలు తాత్కాలికంగా వదిలేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
తెలంగాణ రాజకీయాలకు తాత్కాలికంగా విరామం ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌లో సోదరుడు జగన్‌రెడ్డికి పోటీగా పార్టీ పెడతారా లేదా అన్నది వేచిచూడాలి.