ఒక్క మాట అంటే.. వందల మాటలతో విరుచుకుపడుతున్న కాంగ్రెస్ ఏపీసీపీ చీఫ్ షర్మిల విషయం అంద రికీ తెలిసిందే. ఆమెకు దూరంగానే ఉంటేనే బెటర్ అని వైసీపీ నాయకులు కనీసం నోరుకూడా ఎత్తడం లేదు. ఆదిలో కొంత వరకు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసినా.. తర్వాత మాత్రం ఏవిషయాన్నయి నాతనకు అనుకూలంగా మార్చుకోవడంలో షర్మిల దూకుడును చూసిన తర్వాత.. అందరూ సైలెంట్ అయ్యారు. అయినా కూడా.. షర్మిల.. సందర్భాన్ని వెతుక్కుని మరీ జగన్ను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.
సో.. ఇప్పుడు వైసీపీ కానీ.. ఆ పార్టీ అధినేత జగన్ కానీ ఏం చేయాలి? షర్మిల గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి కూడా మౌనంగా ఉండడమే. కానీ, జగన్ అలా చేయలేదు. నేరుగా కాంగ్రెస్ పార్టీని కెలికారు. షర్మిల విషయా న్ని ప్రస్తావించకుండా.. కాంగ్రెస్ పార్టీ తనకు ఎందుకు మద్దతు ప్రకటించలేదో అర్థం కాలేదన్నారు. అంతే! అసలే కాకమీదున్న షర్మిల.. ఆవెంటనే అన్నను నిప్పులతో కడిగేసింది. నీకెందుకు మద్దతివ్వాలి.. నీది నాటకం. ఢిల్లీలో బూటకం చేశావంటూ.. విరుచుకుపడింది.
తాజాగా ట్వీట్ చేసిన షర్మిల.. జగన్పై తీవ్రస్థాయిలో విరుచుకుడింది. “ జగన్ గారు… మీ ధర్నాకు సంఘీభావం ఎందుకు ప్రకటించాలి? పార్టీ ఉనికి కోసం ఢిల్లీలో కపట నాటకం ఆడినందుకా..? వ్యక్తిగత హత్యకు రాజకీయ రంగు పులిమినందుకా..?“ అని నిలదీశారు. అంతేకాదు.. గత 5 ఏళ్లు బీజేపీతో అక్రమ సంబంధం పెట్టుకుని, విభజన హక్కులను, ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టి.. ఆఖరుకి మణిపూర్ ఘటనపై నోరెత్తని మీకు…ఉన్నట్లుండి అక్కడి పరిస్థితులు గుర్తుకు రావడం విడ్డూరంగా ఉంది“ అని విరుచుకుపడ్డారు.
“క్రిష్టియన్ అయి ఉండి క్రైస్తవులను ఊచకోత గురి చేసినా.. నోరు మెదపకుండా విపక్షాలు పెట్టిన అవిశ్వాస తీర్మానంలో బీజేపీకే మద్దతు ఇచ్చారు కదా? వైఎస్ కూడా వ్యతిరేకించిన మతతత్వ బీజేపికే జై కొట్టారు కదా? మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ దేశవ్యాప్త ఉద్యమం చేస్తుంటే మీనుంచి వచ్చిందా సంఘీభావం? మీ నిరసనలో నిజం లేదని, స్వలాభం తప్ప…రాష్ట్రానికి ప్రయోజనం శూన్యమని తెలిసే కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది. “సిద్దం“ అన్న వాళ్లకు 11మంది బలం సరిపోలేదా.. ఇప్పుడు కలిసి పోరాడుదాం అంటున్నారు?“ అని షర్మిల ప్రశ్నించారు. ఈ పరిణామాలను చూస్తే..జగన్ ఇప్పుడున్న పరిస్థితిలో షర్మిలను కానీ.. కాంగ్రెస్ను కానీ.. కెలకడం మానేయాలని అంటున్నారు పరిశీలకులు.