కాంగ్రెస్ ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ను పోలీసులు కార్యాలయ నిర్బంధం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభు త్వం 6వేల పైచిలుకు పోస్టులతో ఇచ్చిన డీఎస్సీ నోటిఫికేషన్‌పై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. ఎన్నికలకు ముందు మెగా డీఎస్సీ వేస్తామని చెప్పారని.. కానీ, నాలుగేళ్ల పాటు ఊరించి ఊరించి.. కేవ లం ఎన్నికలకు ముందు కంటితుడుపుగా.. 6 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చారన్నది వారి ఆవేదన. ఈ క్రమంలో పలు చోట్ల విద్యార్థులు స్వచ్ఛంగా ఉద్యమాలుచేశారు.
ఇక, వీరి ఉద్యమానికి మద్దతుగా నిలిచిన షర్మిల.. గురువారం చలో సెక్రటేరియెట్‌కు పిలుపునిచ్చారు. అయితే.. దీనిని నిలువరించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఈ క్రమంలో అనేక మందిని ఇప్పటికే గృహ నిర్బంధం కూడా చేసింది. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకుని మరీ బయటకు వచ్చిన.. పార్టీ నాయకులు గిడుగు రుద్రరాజు, మస్తాన్ వలీలను పోలీసులు అడ్డుకుని.. అరెస్టు చేశారు. అదేసమయంలో షర్మిల గత రాత్రి(బుధవారం) విజయవాడలోని గాంధీభవన్‌లో బస చేసిన విషయం తెలిసిందే.
ఆమెను మాత్రం బయటకు రాకుండా.. పోలీసులు.. కార్యాలయంలోనే నిర్బంధించారు. అరెస్టు చేసిన నాయకులను పెనమలూరుకు తరలించారు. ఇదిలావుంటే.. సర్కారు వైఖరిపై షర్మిల ఫైరయ్యారు.
“వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు. మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు. నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు. మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే. ఇందుకు మీ చర్యలే నిదర్శనం. CWC సభ్యులు గిడుగు రుద్రరాజు, వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. 23 వేల పోస్టులను భర్తీ చేస్తామని చెప్పి 6 వేలకే నోటిఫికేషన్ ఇచ్చినందుకు వైసీపీ సర్కార్ నిరుద్యోగులకు క్షమాపణలు చెప్పాలి“ అని షర్మిల డిమాండ్ చేశారు.
వైసీపీ నియంత పాలనలో మెగా డీఎస్సీనీ దగా డీఎస్సీ చేశారని నిలదీస్తే అరెస్టులు చేస్తున్నారు.మా చుట్టూ వేలాది మంది పోలీసులను పెట్టారు. ఇనుప కంచెలు వేసి మమ్మల్ని బందీలు చేశారు.నిరుద్యోగుల పక్షాన నిలబడితే అరెస్టులు చేస్తున్నారు.మమ్మల్ని ఆపాలని చూసే మీరు ముమ్మాటికీ నియంతలే.ఇందుకు మీ… pic.twitter.com/2F7eqTpEJU
— YS Sharmila (@realyssharmila) February 22, 2024