ఏపీ ముఖ్యమంత్రి సోదరి షర్మిల, తల్లి వైఎస్ విజయలక్ష్మి ఈరోజు నాంపల్లి కోర్టులో హాజరు కానున్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు గతంలో వారిపై నమోదైన కేసు విచారణ నేడు జరగనుంది. నాంపల్లి ప్రత్యేక కోర్టు నోటీసులు జారీ చేస్తూ వారిద్దరిని హాజరుకమ్మని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వైఎస్ షర్మిల, విజయలక్ష్మి నేడు నాంపల్లి కోర్టుకి హాజరయ్యారు.
ఇదేదో 2019 కేసు అనుకున్నారేమో. కాదు, చాలా పాత కేసు. 2012లో పరకాల ఉపఎన్నికల సమయంలో ఎలాంటి అనుమతి తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా వైఎస్ విజయలక్ష్మి, షర్మిల రోడ్డు షో నిర్వహించారు. అప్పట్లో వీరు కొండా సురేఖకు మద్దతుగా ప్రచారానికి వచ్చారు. కొండా సురేఖతో పాటు ఆమె భర్త కొండ మురళిపై, షర్మిలపై, విజయమ్మపై కూడా కేసు నమోదయ్యింది.
పరకాల ఎన్నికల ప్రచారంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు నలుగురు కచ్చితంగా విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా ఇవాళ ఈ నలుగురూ కోర్టుకు హాజరుకాబోతున్నారు. అయితే, ప్రస్తుతం ఇద్దరు వేర్వేరు పార్టీల్లో ఉన్నారు. తెలంగాణ వైకాపా దుకాణం మూసేశాక వారు కాంగ్రెస్ కి షిఫ్ట్ అయ్యారు.