ఏపీ అసెంబ్లీలో ఆసక్తికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. 151 మంది ఎమ్మెల్యేలున్న అధికార పక్షం ప్రతిపక్షం దెబ్బకు ఉక్కిరిబిక్కిరవుతోంది. వాస్తవానికి రాష్ట్రంలో పరిస్థితులు అలా ఉన్నాయి. కేవలం ఏడాదిన్నరలో 7 వరదలు ఎపుడూ రాలేదు. అయితే, వరదల్లో తీవ్రంగా నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగ నిలవకపోవడంపై ప్రతిపక్షం చేస్తున్న నిరసనకు, వేస్తున్న ప్రశ్నలకు అధికార పక్షం వద్ద సమాధానం కూడా లేదు. దీంతో సభను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారు.
ఈరోజు ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో మాట్లాడుతూ సంబంధం లేని సబ్జెక్టు ప్రస్తావనకు తెచ్చి ఇరుక్కున్నారు. నేను చెప్తే చేస్తానని ప్రజలు నమ్ముతున్నారు. నాకు విశ్వసనీయత ఉంది. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు అని తన క్రెడిబులిటీ గురించి గొప్పలు చెప్పబోయి జగన్ ఇరుక్కున్నారు. అయితే దీనిపై పెద్ద ఎత్తున ముఖ్యమంత్రిపై విమర్శలు వస్తున్నాయి.
అవును జగన్ గారు మీరు ఒక్కసారి చెబితే ఇక మాట తప్పేదే లేదు
2021లో పోలవరం కడతాను అన్నారు. 2022 కి మార్చారు
అమరావతే రాజధాని అన్నారు. ఇపుడు మూడు రాజధానులు అన్నారు
ఉగాది కి అందరికీ ఇంటి పట్టాలు అన్నారు, దసరా, దీపావళి కూడా అయిపోయింది
ఎమ్మెల్యేలను కొనం అన్నారు, అది కూడా అయిపోయింది
రైతులకు గత ఏడాది వరద నష్టపరిహారం 2 వేలు అన్నారు, ఇంకో ఏడాది వచ్చేసింది
ప్రతి ఏటా 250 పింఛను పెంచుతాం అన్నారు, మరుసటి ఏడాదే ఎగ్గొట్టారు
ఇంకా చాలా ఉన్నాయి, మీరు చెప్పనవి కూడా చేశారు
1. పెట్రోలు డీజిలు ధరలు పెంచుతాం అని చెప్పకున్నా పెంచారు.
2. రేషన్ సరుకుల ధరలు పెంచుతాం అని చెప్పకున్నా పెంచారు
3. రైతుల పొలాలకు మీటర్లు పెడతాం అని చెప్పకపోయినా పెడుతున్నారు.
4. టోల్ గేట్స్ పెడతాం అని చెప్పకపోయినా టోల్ గేట్స్ పెట్టారు
5. కరెంటు చార్జీలు పెంచుతాం అని చెప్పకపోయినా పెంచేశారు
6. బస్సు చార్జీలు పెంచుతాం అని చెప్పకపోయినా పెంచేశారు
7. పింఛన్లు తీసేస్తాం అని చెప్పకపోయినా పింఛన్లు తీసేశారు
ఇదీ మీ విశ్వసనీయత. మీ విశ్వసనీయత ఏంటో ఏపీ ప్రజలు బాగా తెలుసు అని నెటిజన్లు జగన్ పై సెటైర్లు వేస్తున్నారు.