కలియుగ దైవం అయిన తిరుమల వెంకన్న ఆలయంలోకి ప్రవేశించే అన్యమతస్థుల డిక్లరేషన్ వ్యవహారంపై చాలాకాలంగా ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం జగన్ తిరుమల వెళ్లినపుడు అక్కడ డిక్లరేషన్ పై సంతకం పెట్టకపోవడంపై దుమారం రేగింది. 6 కోట్ల ఆంధ్రుల ప్రతినిధిగా శ్రీవారికి సీఎం జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తున్నారని, జగన్ కేవలం హిందువుల ప్రతినిధిగా మాత్రమే తిరుమలకు వెళ్లడం లేదని కొడాలి నాని వంటి వారు సమర్థించుకున్న వైనంపై కూడా విమర్శలు వచ్చాయి.
ఏపీలో అన్ని మతాలు, కులాల వారు ఉన్నారని, సీఎం జగన్‌ను డిక్లరేషన్‌పై సంతకం చేయాలని కోరడం సరికాదని నాని చేసిన కామెంట్లు గతంలో కాక రేపాయి. అయితే, జగన్ ప్రతిపక్ష నేతగా, సీఎంగా ఎన్నిసార్లు తిరుపతి వెళ్లినా ఒంటరిగానే వెళ్లారుగానీ, సతీసమేతంగా, కుటుంబసమేతంగా ఒక్కసారి కూడా వెళ్లలేదు. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై టీడీపీ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గతంలో చేసిన సంచలన వ్యాఖ్యల వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అసలు రెడ్లం తామని, తెలుగుదేశం పార్టీలో ఉండే తాము కల్తీ రెడ్లం కాదని నల్లారి కిషోర్ కుమార్ గతంలో ఘాటు వ్యాఖ్యలు చేయడం అప్పట్లో సంచలనం రేపింది. వైసీపీలో ఉండేది కల్తీ రెడ్లు అని, టీడీపీలో ఉండేది అసలు రెడ్లని షాకింగ్ కామెంట్లు చేశారు. తిరుమల కొండకు ఎవరైతే ఫ్యామిలీతో పోరో వాళ్లు రెడ్లు కాదని, ఎవరైతే భార్యాబిడ్డలతో పోతారో వాళ్లు రెడ్లు అంటూ కిషోర్ చేసిన కామెంట్ల వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘జగన్ రెడ్డి తిరుపతికి ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా వెళ్లారు తప్ప కుటుంబంతో వెళ్ళలేదు. అందుకు కారణం ఏంటో వినండి’ అంటూ నల్లారి మాట్లాడిని వీడియో తాజాగా సర్క్యులేట్ అవుతోంది.
ఆగస్టు 15న మంత్రి ఉష శ్రీ తిరుమల కొండపై దాదాపు 50 మంది అనుచరులతో ప్రత్యేక దర్శనం చేసుకోవడంపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో కిషోర్ కామెంట్లు వీడియో చర్చనీయాంశమైంది. కొద్ది రోజుల ముందు, మంత్రి అప్పలరాజు కూడా ఇలాగే తన అనుచరులకూ ప్రత్యేక దర్శనం కావాల్సిందేనంటూ పట్టుబట్టడం హాట్ టాపిక్ గా మారింది. జగన్ పాలనలో తిరుమల పవిత్రత దెబ్బతిందని, ఇలా వైసీపీ నేతల తీరుతో భక్తులు ఇబ్బంది పడుతున్నారని విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
జగన్ రెడ్డి తిరుపతికి ఎప్పుడు వెళ్లినా ఒంటరిగా వెళ్లారు తప్ప కుటుంబంతో వెళ్ళలేదు. అందుకు కారణం ఏంటో వినండి. pic.twitter.com/PlDvZlzlho
— Telugu Desam Party (@JaiTDP) August 16, 2022