యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తాగుతూ పోలీసులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన వైనం హాట్ టాపిక్ గా మారింది. షణ్ముఖ్ అన్నయ్య సంపత్ వినయ్ కోసం పోలీసులు షణ్ముఖ ఇంటికి వెళ్ళగా అక్కడ గాంజా కొడుతూ షణ్ముఖ్ పోలీసుల కంట పడటంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనను సంపత్ శారీరకంగా వాడుకొని పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని, వేరే అమ్మాయితో పెళ్లికి ఒప్పుకున్నాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు వారి ఇంటికి వెళ్లారు.
ఈ సమయంలోనే షన్ను గాంజా కొడుతూ కనిపించడంతో అతడి వద్ద ఉన్న 16 గ్రాములు గంజాయిని సీజ్ చేసి అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంపత్ ను కూడా అరెస్టు చేసిన పోలీసులు ఇద్దరిపై వేర్వేరు కేసులు పెట్టారు. ఆ యువతితో సంపత్ కు నిశ్చితార్థం కూడా అయిందని, మరికొద్ది రోజుల్లోనే పెళ్లి అని తెలుస్తోంది. అయితే, తనకు తెలియకుండా వేరే అమ్మాయిని సంపత్ పెళ్లి చేసుకున్నాడని తెలుసుకున్న యువతి పోలీసులను ఆశ్రయించింది.
ఇలా అన్న కోసం వెళ్తే తమ్ముడు షణ్ముఖ్ కూడా గంజా కేసులో బుక్ కావడం హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ యాక్సిడెంట్ చేసిన హిట్ అండ్ రన్ కేసులో షణ్ముఖ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు కూడా షణ్ముఖ్ తప్ప తాగి వాహనం నడిపినట్టుగా ప్రచారం జరిగింది.