ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉండే పొలిటికల్ లీడర్లలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఒకరు. అక్కడ తన దృష్టికి వచ్చే సమస్యలపై సత్వరమే స్పందించి పరిష్కిరించే ప్రయత్నం చేస్తుంటారు. ఈ మధ్య కరోనా కారణంగా కొన్ని రోజులు ట్విట్టర్‌కు దూరంగా ఉన్న కేటీఆర్.. మళ్లీ యాక్టివ్ అయ్యారు.
ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ సిలిండర్లు, వెంటిలేటర్లు లాంటి కోసం అత్యవసర స్థితిలో తనను ట్యాగ్ చేసిన వాళ్లకు ఆయన తన టీం ద్వారా సాయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కరోనా టైంలో రకరకాల సమస్యలను కూడా ఆయన దృష్టికి తెస్తున్నారు నెటిజన్లు.
ఐతే తాజాగా కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఒక వ్యక్తి చేసిన ట్వీట్.. దానికి కేటీఆర్ స్పందించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షించింది. తోటకూరి రఘుపతి అనే ఓ నెటిజన్ జొమాటాలో చికెన్ బిరియాని ఆర్డర్ చేశాడట.
ఐతే ఎక్స్ట్రా మసాలా, లెగ్ పీస్ కోసం తాను విజ్ఞప్తి చేస్తే.. అవేవీ రాలేదని.. ఇలాగేనా జనాలకు సర్వ్ చేసేది అని అతను జొమాటో వాళ్లను ట్యాగ్ చేసి ట్వీట్ పెట్టాడు. పనిలో పనిగా కేటీఆర్‌ను సైతం అతను ట్యాగ్ చేశాడు. దీనిపై కేటీఆర్ స్పందించాడు. ఈ ఇష్యూ గురించి నాకెందుకు ట్యాగ్ చేశావు.. ఇందులో నా నుంచి ఏం ఆశిస్తున్నావ్ బ్రదర్ అంటూ ట్వీట్ వేశాడు.
ఐతే నేరుగా కేటీఆరే స్పందించేసరికి సదరు నెటిజన్ తన ట్వీట్‌ను డెలీట్ చేసుకుని వెళ్లిపోయాడు. జొమాటో వాళ్లు మాత్రం జరిగినదానికి చింతిస్తున్నామని, ఇలా జరక్కుండా చూసుకుంటామని ట్వీట్ వేశారు. ఐతే ఇది చిన్న విషయం అని ఊరుకోకుండా కేటీఆర్ స్పందించడం నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది.
దీనిపై జనాలు సరదాగా ట్వీట్లు వేశారు. ఆ వ్యక్తికి అన్యాయం జరిగింది.. అతడికి వెంటనే కేటీఆర్ ఎక్స్ట్రా మసాలా, లెగ్ పీస్ ఇప్పించండి అంటూ స్పందించారు.
@KTRoffice must immediately respond ????,must say that @MinisterKTR & his team have been responding to the medical needs of people during this pandemic mashallah
— Asaduddin Owaisi (@asadowaisi) May 28, 2021