పాలకుల పర్యవేక్షణ తగ్గితే ప్రభుత్వ వ్యవస్థలు సరిగా పనిచేయవు. ఆ వ్యవస్థలు సరిగా పనిచేయకపోతే సామాన్యులకు నరకం కనిపిస్తుంది. కనీస సదుపాయాలు, ప్రాథమిక హక్కులు కూడా సామాన్యులకు అందకుండా పోతాయి. ఇలాంటి ఘోరం ఒకటి అనంతపురంలో జరిగింది. పాపం ఓ అభాగ్యుడు ప్రభుత్వ పొరపాటు వల్ల ప్రాణం పోగొట్టుకున్నాడు.
అనంతపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన ఏపీలో ప్రభుత్వ వైఫల్యాన్ని స్పష్టంగా చూపుతోంది. అనంతపురం జిల్లా కలెక్టరేట్ ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతని పేరు రాజశేఖర్ రెడ్డి. అతని తల్లికి డ్వాక్రా గ్రూప్ ద్వారా రావల్సిన డబ్బు రాలేదు. వాళ్లకు చాలా అవసరం ఉండటంతో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఎవరూ పట్టించుకోలేదు. డబ్బుల విషయం గురించి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు కలెక్టరేట్ కు వెళ్లాడు.
స్పందన అధికారుల నుంచి సరైన సమాధానం రాలేదు. దీంతో ఇక మాకు డబ్బు రాదు అని అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. బయటకు వచ్చి కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు అతన్ని గమనించి మంటలు ఆర్పి హుటాహుటిన అతనిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయినా ఫలితం లేకపోయింది. అప్పటికే రాజశేఖరరె్డడి ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు.
జగన్ ముఖ్యమంత్రి కావాలని దగ్గరుండి ఓటు వేసి వేయించిన వ్యక్తి ఇలా అదే ప్రభుత్వం వైఫల్యం వల్ల చనిపోవడం అంటే… అసలు ఏపీలో ఏం జరుగుతోంది?