ఔను.. ఆ ఎమ్మెల్యేలను తేలికగా వదిలేస్తారా? ఏమైనా చేస్తారా? ఇదీ.. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న చ ర్చ. పార్టీకి అనుకూలంగా ఉండాలని.. పార్టీ అధినేత పట్ల అత్యంత విధేయులుగా ఉండాలని పార్టీ రాజ్యాం గంలో ఫస్ట్ పేరాలోనే పేర్కొన్నారు. పైకి ఎలాంటి కట్టుబాట్లు కనిపించకపోయినా.. అంతర్గత ప్రజాస్వా మ్యం ఎక్కువని ఊదరగొట్టినా.. అసలు వైసీపీలో ఉన్న కట్టుబాట్లు వేరు. అధినేత పట్ల, పార్టీ పట్ల ఎవరూ పరుషంగా మాట్లాడరాదనేది అత్యంత కీలకమైన విషయం.
మరోవైపు టీడీపీని గమనిస్తే.. క్రమశిక్షణకు మారుపేరు అని నాయకులు పదే పదే చెబుతుంటారు. కానీ, ఇక్కడ మాత్రం కుమ్ములాటలు.. నేరుగా రోడ్డెక్కుతాయి. కానీ, కట్టుబాట్లు వంటివి ఏమీ లేదని చెప్పుకొనే వైసీపీ మాత్రం నిజానికి చాలానే కట్టుబాట్లు ఉన్నాయి. నిధులు ఇవ్వకపోయినా.. అభివృద్ధి లేకపోయినా.. నాయకులు నోరు విప్పడానికి నోరు ఎత్తడానికి కూడా అవకాశం లేదు. ఇదీ.. వైసీపీ అమలు చేస్తున్న అంతర్గత కట్టుబాటు.
అయితే..ఈ కట్టుబాటును ఇటీవల కాలంలోకొందరు తోసిపుచ్చారు. బాహాటంగానే విమర్శలు గుప్పించా రు. పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు ప్రకటించారు. పార్టీపైనా.. పాలనపైనాయుద్ధం చేస్తామని కూడా కోటంరెడ్డి వంటివారు ప్రకటించారు కూడా! అయితే.. ఇది అంత ఈజీయేనా? వారు అనుకున్నట్టుగా రాబోయే రోజులు ఉంటాయా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. ఎందుకంటే.. వైసీపీ అధినేత వద్ద తేడా వస్తే.. తన మన అనే తేడా లేదు. అందరినీ ఒకే విధంగా చూస్తున్నారు.
ఈ క్రమంలో పార్టీపై ఎగస్పార్టీ జెండా ఎగురవేసిన నాయకులను లైన్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభమవుతున్నాయని అంటున్నారు కీలక నాయకులు. గతంలో కోటంరెడ్డిపై పలు కేసులు ఉన్నాయి. టీడీపీ హయాంలోనే వీటిని నమోదు చేశారు. క్రికెట్ బెట్టింగులు.. బెదిరింపులు.. అధికారులపై దౌర్జన్యం వంటి కేసులు 2016-18 మధ్య పది వరకు నమోదయ్యాయి. ఇంతలోనే ఎన్నికలు రావడంతో అవిమరుగున పడ్డాయి.
ఇప్పుడు వీటిని వెలికి తీస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాలుచెబుతున్నాయి. ఈ కేసులను తిరగదోడి.. కోటంరెడ్డికి ఊపిరి సలపకుండా చేసే అవకాశం ఉందని అంటున్నారు. అదేమంటే.. ఇవి టీడీపీ పెట్టిన కేసులేనని సమర్థించుకునే ప్రయత్నం చేయనున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో కోటంరెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.