ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు ఇష్టా రాజ్యంగా న్యాయమూర్తులు, కోర్టులపై నోటికి వచ్చిన విమర్శలు చేయడానికి కోర్టు సీరియస్ గా తీసుకుంది. ప్రభుత్వం తనంతట తాను కేసులు పెట్టి వారిని అరెస్టు చేయాల్సి ఉన్నా చేయలేదు. దీంతో ఎపుడూ లేని విధంగా హైకోర్టు పోలీసు కేసు పెట్టినా సీఐడీ దానిని నిర్లక్ష్యం చేయడంతో హైకోర్టు ఈరోజు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
వైకాపాను, ప్రభుత్వాన్ని ఏమైనా చిన్న విమర్శలు చేసినా వెంటనే వేటాడి వారిని అరెస్టు చేసిన సీఐడీ న్యాయమూర్తులను అవమానిస్తే నిందితులు దొరకలేదని, అందుబాటులో లేరని హాస్యాస్పదమై కారణాలు చెప్పడంతో మొన్న చీవాట్లు పెట్టిన హైకోర్టు ఒక అవకాశం సీఐడీకి ఇచ్చింది. అయినా సీఐడీ అధికారులు సరిగా స్పందించకపోవడంతో ఈరోజు ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ కేసును సీబీఐకి అప్పగించింది. దీంతో కోర్టులపై విమర్శలు చేసిన నేతలు, కార్యకర్తలు గుండెలు జారిపోయాయి. ఇపుడు సీబీఐ వేట మొదలైతే ఇది ఎక్కడి దాకా వెళ్తుందో అంతు చిక్కని పరిస్థితి.