వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫేక్ కాదు అని టీడీపీ నేత పట్టాభి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి ఫోరెన్సిక్ నిపుణుడు ధృవీకరించిన ఎటువంటి నివేదిక లేకుండానే ఆ వీడియోను ఎడిటింగ్, మార్ఫింగ్ చేశారని ఎస్పీ ఫకీరప్పతో చెప్పించారని పట్టాభి ఆరోపించారు. అందుకే, వైసీపీ నేతల నోరు మూయించేందుకు గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ నివేదికను పట్టాభి బట్టబయలు చేశఆరు.
అమెరికాలో పేరుగాంచిన ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు చెందిన ఫోరెన్సిక్ నిపుణులు జిమ్ స్టాఫర్డ్ ఇచ్చిన నివేదికను పట్టాబి మీడియాకు విడుదల చేశారు. గోరంట్ల వీడియోకు సంబంధించి జిమ్ ఇచ్చిన రిపోర్ట్ ను బట్టబయలు చేసి గోరంట్ల గుట్టురట్టు చేశారు. ఆగస్టు 9న ల్యాబ్‌కు ఈ వీడియోను పంపామని.. వారు ఆగస్టు 12న నివేదికను తమకు పంపారని వెల్లడించారు. యాంప్డ్ ఫైవ్ వీడియో ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్ సాయంతో ఈ వీడియో ఒరిజనల్ అవునా, కాదా.. మార్ఫింగ్ జరిగిందా, ఎడిటింగ్ జరిగిందా అని ఆ నివేదికలో ఉందని తెలిపారు.
ఈ వీడియో ఒరిజినల్ అని, మార్ఫింగ్ చేయలేదని జిమ్ తేల్చి చెప్పారని పట్టాభి వెల్లడించారు. మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ఈ రిపోర్ట్ సరిపోతుందా అని జగన్ ను ప్రశ్నించారు. ఎంపీ తప్పు చేస్తే చర్యలు తీసుకోకుండా వెనకేసుకోస్తారా.. దీనికి సమాధానం ఏం చెబుతారని జగన్ ను నిలదీశారు. అయితే, తాజాగా ఈ నివేదికను ఇచ్చిన జిమ్ పై కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది.
ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన డర్టీ పనిని కప్పిపుచ్చుకునేందుకు కులం కార్డును కూడా వైసిపి నేతలు వాడుకున్నారు అన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలో కురుబ వర్సెస్ కమ్మ కులస్తుల మధ్య అగ్గిరాజేశారు గోరంట్ల మాధవ్. ఇక తాజాగా గోరంట్ల మాధవ్ వీడియోను మార్ఫింగ్ చేయలేదు అని నిర్ధారించిన ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టాఫర్డ్ కు కూడా కులం రంగును ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ పేటీఎం బ్యాచ్.
జిమ్ కు కూడా కులం మతం అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. సిగ్గు లేకుండా న్యూడ్ వీడియో తో అడ్డంగా దొరికిపోయిన గోరంట్ల మాధవ్ ను అంతే నిస్సిగ్గుగా వైసీపీ నేతలు వెనకేసుకు రావడం పై విమర్శలు వస్తున్నా అవి పట్టించుకోకుండా ఈ వ్యవహారానికి కులం రంగు పూసి మారేడు కాయ చేయడానికి ప్రయత్నించటం చర్చనీయాంశమైంది. ఆఖరుకు ఆంధ్ర రాజకీయాలతో ఆ మాటకొస్తే భారత దేశ రాజకీయాలతో ఏమాత్రం సంబంధంలేని జిమ్ వంటి ఫోరెన్సిక్ నిపుణుడికి కూడా కులం రంగు ఆపాదించడం, పక్షపాత ధోరణిని అంటగట్టటం వంటివి చేస్తున్న వైసీపీ నేతలపై సోషల్ మీడియాలో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.
గోరంట్ల మాధవ్ డర్టీ వీడియో ఫోరెన్సిక్ నివేదికలో ఏం చెప్పారు?@PattabhiRamK1#YcpMpDirtyPicture #YCPMPsexScandal#WhoRemovedLungi #DirtyJGang pic.twitter.com/nxPXioJnkn
— Telugu Desam Party (@JaiTDP) August 13, 2022