అధికార పార్టీ వైసీపీకి డిజిటల్ రూపంలో అండదండలు అందించే సోషల్ మీడియా వేదికలు ఏమయ్యా యి ? ఒక్కసారిగా మూగబోయాయా? లేక.. వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నాయా? అసలు ఏం జరిగింది? అనే చ ర్చ జోరుగా సాగుతోంది. ఎక్కడ ఏం జరిగినా.. వెంటనే స్పందించే.. వైసీపీ సోషల్ మీడియా విభాగం ఇప్పుడు ఫుల్లు సైలెంట్ అయింది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షాన్ని టార్గెట్ చేసుకునే ఈ సోషల్ మీడియా.. కొన్నాళ్లు గా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కూడా టార్గెట్ చేసుకుని కామెంట్లు చేస్తోంది. అయితే.. ఇప్పుడు ఎన్నికల సమయంలో ఎందుకు మూగబోయింది? అనే చర్చ జోరుగా సాగుతోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు.
1. నెటిజన్ల కనెక్ట్ నై!: వైసీపీ సోషల్ మీడియా విభాగానికి ఆ పార్టీ ఎనలేని ప్రాధాన్యం ఇస్తుంది. భారీ ఎత్తున బడ్జెట్ కూడా ఉంది. ట్విట్టర్, ఫేస్ బుక్, ఇన్‌స్ట్రాగ్రామ్, వాట్సాప్.. ఇలా అనేక మాధ్యమాల ద్వారా వైసీపీ వాయిస్‌ను వినిపిస్తున్నారు. ఇటీవల రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు-ప్రభుత్వానికి మధ్య తలెత్తిన వివాదంలోనూ యాక్టివ్‌గా పనిచేసిన ఈ మీడియా.. అడుగడుగునా.. ప్రభుత్వాన్ని సమర్ధించింది. అదేసమయంలో నిమ్మగడ్డను ఏకేసింది. అయితే.. వాస్తవాలకు విరుద్ధంగా వ్యాఖ్యలు, రాతలు ఉండడంతో ఇటీవల కాలంలో నెటిజన్ల సంఖ్య వైసీపీ సోషల్ మీడియాకు తగ్గిపోయింది. కామెంట్లు, వీవర్ షిప్ కూడా భారీగా కోతపడింది.
2. విశ్వస నీయత లోపించిందా: ఇక, వైసీపీ సోషల్ మీడియా మ్యూట్ అవడానికి మరో కారణం.. ప్రభుత్వం, పార్టీ కూడా అన్నింటా విఫలం కావడమేనని అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నేతల కామెంట్లు, ప్రభుత్వ నిర్ణయాలు వైసీపీ సోషల్ మీడియా వింగ్‌లో ప్రచారం చేస్తున్నారు. అయితే.. మొదట్లో బాగానే ఉన్నా.. ఎప్పటికప్పుడు.. ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కోర్టులు కొట్టేస్తుండడంతో సోషల్ మీడియాపై ప్రజలకు విశ్వసనీయత లోపించిందనే వాదన బలంగా వినిపిస్తోంది. దీంతో వైసీపీ సోషల్ మీడియా మ్యూట్ అయిందని చెబుతున్నారు.