వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తమకు ఎదురులేదని భావించిన పలువురు నాయకులు ఇప్పుడు జైళ్లలో మగ్గుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒక కేసు అంటే ఫర్వాలేదు. కానీ, చేసిన పాపం వారిని కేసులపై కేసుల రూపంలో వెంటాడుతుండడం గమనార్హం. దీంతో ఒక జిల్లాలో కేసులో ఇరుక్కుని జైలుకు వెళ్లిన వారు.. బెయిల్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంటే.. మరో జిల్లాలో కేసు నమోదవుతోంది. దీంతో ముందు కేసులో బెయిల్ పొందినా.. తర్వాత కేసులో జైల్లోనే ఉండాల్సి వస్తోంది.
దీంతో ఇలాంటి వారిపై వైసీపీ జైలు పక్షులు అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. వైసీపీ సాను భూతి పరుడి ముసుగులో టీడీపీ, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు… బోరు గడ్డ అనిల్ కుమార్. పైగా ఎస్సీ కార్డును వినియోగించుకుని..త నను ఎవరైనా విమర్శిస్తే.. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిస్తానని అప్పట్లో బెదిరిం చారు. దీంతో అందరూ అప్పట్లో మౌనంగా ఉన్నారు.కానీ, కూటమి సర్కారు కొరడా ఝళిపించడంతో ఇప్పుడు బోరుగడ్డపై పలు జిల్లాల్లో కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే గుంటూరులో బోరుగడ్డ అనిల్‌పై కేసు నమోదైంది. దీంతో ఆయనను జైలుకు తరలించారు. ఇక, తర్వాత.. అనంతపురంలో కేసు నమోదైంది. ఈ కేసులోనూ ఆయనపై ఎఫ్ ఐఆర్ నమోదైంది. ఇక, తాజాగా కర్నూలు జిల్లాలోనూ బెదిరించారన్న కేసు నమోదైంది. దీంతో ఇప్పుడు అక్కడి కోర్టులో విచారణ ప్రారంభమైంది. అదేవిధంగా మాజీ ఎంపీ నందిగం సురేష్ విషయంలోనూ.. కేసులపై కేసులు నమోదవుతున్నాయి.
సోషల్ మీడియాలో చెలరేగి కామెంట్లు చేయించారన్న కేసులు ఒకవైపు వెంటాడుతుండగా.. మరోవైపు మరియమ్మ అనే మహిళ హత్య కేసు నమోదైంది. ఇప్పుడు.. రాజధాని రైతులు తమను దూషించారని. పోలీసులను ప్రేరేపించి తమను కొట్టించారని తాజాగా మరో ఫిర్యాదు చేశారు. దీంతో ఈయన కూడా జైలు నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. ఇలా చాలా మంది నాయకులు.. జైలు పక్షులుగా మారిపోయారు. ఏదేమైనా అధికారం ఉందని చెలరేగితే ఇలానే ఉంటుందని అంటున్నారు పరిశీలకులు.