ఆహాలో బాలకృష్ణ హోస్ట్‌గా ప్రసారవుతున్న అన్‌స్టాపబుల్ షో ఎలాంటి వైబ్రేషన్స్ సృష్టిస్తోందో తెలిసిందే. ఎంటర్టైన్మెంట్ పరంగానే కాకుండా పొలిటికల్‌గానూ ఈ షో ఇప్పటికే సంచలనం సృష్టించింది. చంద్రబాబు, లోకేశ్‌లతో చేసిన సీజన్2లోని మొదటి ఎపిసోడ్ పొలిటికల్గాసంచలనం సృష్టించడగా తాజాగా ప్రభాస్‌తో బాలయ్య చేసిన షో ఏకంగా రికార్డులను బద్దలుకొట్టింది. ఈ రెండు చాలవన్నట్లుగా త్వరలో పవన్ కల్యాణ్ కూడా బాలయ్య షోకు రానున్నాడు. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తయిపోయింది.
పవన్‌కు ఉన్న ఫాలోయింగ్‌తో పాటు పొలిటికల్‌గానూ వచ్చే ఎన్నికల్లో ఆయన కీలకం కానుండడంతో ఎలాగైనా ఆ ఎపిసోడ్‌కు ఆటంకాలు సృష్టించాలని వైసీపీ ప్లాన్ చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఆహా ఓటీటీ ప్లాట్‌ఫాం కావడంతో అడ్డంకులు ఎలా సృష్టించాలనే విషయంలో సమాలోచనలు జరుగుతున్నట్లుగా చెబుతన్నారు. న్యాయపరమైన చిక్కులతో అడ్డంకులు సృష్టించడానికి.. సాంకేతికంగా సమస్యలు సృష్టించడానికి ఉన్న అన్ని అవకాశాలనూ ప్రయత్నిస్తున్నట్లు వైసీపీ వర్గాల నుంచే లీకులొస్తున్నాయి.
వైసీపీ తనపై చేస్తున్న అనేక ఆరోపణలు, విమర్శలకు పవన్ ఈ షో ద్వారా సమాధానం ఇస్తారని.. అంతేకాకుండా వైసీపీ నోళ్లు మూయించేలా ఎవరూ ఊహించనివిధంగా ఇది ఉంటుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అదేజరిగితే పొలిటికల్‌గా పవన్‌కు ప్లస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆటంకాలు సృష్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి.